»   » హాట్ టాపిక్: పవన్ కళ్యాణ్ తో సన్ని లియోన్ డాన్స్

హాట్ టాపిక్: పవన్ కళ్యాణ్ తో సన్ని లియోన్ డాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన ఫోర్న్ కెరీర్‌కు బ్రేక్ వేసి....ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో తన అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్ జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్ ఛాన్స్ దక్కించుకుంది. తర్వాత బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తున్న ఆమె కన్ను తెలుగుపై పడింది. ఈ విషయం రీసెంట్ గా తెలుగులో ఐటం సాంగ్ చేస్తున్నానని చెప్పింది. అయితే ఆ ఐటం సాంగ్ మరేదో చిత్రంలో కాదు పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం గబ్బర్ సింగ్ -2 లో అని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.

ఈ మేరకు ఆ మద్యన ముంబై వెళ్లి మరీ సన్నిలియోన్ ని సంప్రదించారని, ప్రాజెక్టుకు క్రేజ్ తీసుకురావటానికి చేసే ప్రయత్నం ఇదని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రత్యేకంగా క్రేజ్ తెచ్చే పనేముందనేది కొందరి ప్రశ్న. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక సాంగ్ సూపర్ హిట్టవటంతో...అదే తరహా ఐటం సాంగ్ ని డిజైన్ చేస్తున్నారని..ఆ స్లాట్ లోకే సన్నిలియోన్ వచ్చిందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో 'గబ్బర్ సింగ్-2' చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ చివర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. సినిమా ఇంకా మొదలు కానప్పటికీ.....ముందస్తుగా పక్కా ప్లానింగుతో రెడీ అయ్యారు దర్శక నిర్మాతలు. దర్శకుడు సంపత్ నంది ఇప్పటికే స్క్రిప్టు వర్కు పూర్తి చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

గబ్బర్ సింగ్ తొలి భాగం గుంటూరు జిల్లా కొండవీడు నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్‌గా దర్శనమిచ్చారు......సీక్వెల్ గబ్బర్ సింగ్ 2లోనూ పవన్ క్యారెక్టర్ అదే అయినప్పటికీ, సినిమా మధ్య ప్రదేశ్‌లోని చంబల్ లోయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించేది ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

English summary
From past few days there have been reports that, Power Star will be shaking a leg with Adult Star Sunny Leone on an item number in his new film ‘Gabbar Singh 2’. Sunny Leone is making her South entry with a Tamil film ‘Vadacurry’ where she is playing a special role. Jai and Swati Reddy are lead cast.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu