»   » నిజమా... రూమరా? : ఇక్కడ నాగ్..అక్కడ రజనీ

నిజమా... రూమరా? : ఇక్కడ నాగ్..అక్కడ రజనీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: హిట్ అయిన సినిమాలకు ఉండే డిమాండే వేరు. ఆ సినిమాలు రీమేక్ చేయటానికి దర్శకులు, నిర్మాతలు ఎగబడుతూంటారు. హీరోలకు కూడా ఎందుకైనా మంచిదని ప్రక్క రాష్ట్రాల్లో హిట్టైన చిత్రాలు, రిలీజవుతున్న పెద్ద హీరోల సినిమాలపై ఓ కన్నేసి ఉంచుతారు.

అలాగే ఇప్పుడు కన్నడంలో సూపర్ హిట్ అయిన హర్రర్...ధ్రిల్లర్ చిత్రాన్ని తెలుగు,తమిళంలోకి రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ చిత్రం మరేదో కాదు శివలింగ. కన్నడంలో హీరో శివరాజకుమార్, వేదిక, శక్తి వాసుదేవన్ లీడ్ రోల్ లో చేసిన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యింది.

పిభ్రవరి 12వ తేదీన విడుదలైన ఈ చిత్రం కర్ణాటక అంతటా పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ దుమ్మురేపుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసిన తమిళ దర్శకుడు పి.వాసు కన్ను ఈ హీరోలు ఇద్దరిపై చెప్తున్నారు. ఆయన ఈ చిత్రం రైట్స్ ఓ భారీ నిర్మాత చేత కొనిపించి రీమేక్ చేయటానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

స్లైడ్ షోలో మిగతా డిటేల్స్

చంద్రముఖి తరహాలో

చంద్రముఖి తరహాలో

గతంలో పి.వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి ఓ హర్రర్ ..ధ్రిల్లర్ చిత్రం . అది భారీ సంచలన సృష్టించింది.

రజనీ కూడా...

రజనీ కూడా...

పి. వాసు దర్శకత్వంలో రావటంతో రజనీ కూడా ఈ చిత్రం ఒరిజనల్ వెర్షన్ చూడటానికి ఇంట్రస్ట్ చూపుతున్నట్లు చెప్తున్నారు.

ఇక్కడ నాగ్

ఇక్కడ నాగ్

తెలుగుకు మార్కెట్ కోసం రజనీతో పాటు నాగార్జున ని కూడా ఈ సినిమాకు అడుగుతున్నట్లు చెప్తున్నారు.

కామెడీ ట్రాక్

కామెడీ ట్రాక్

సినిమాలో సాధు కోకిల కామెడీ ట్రాక్ బాగా పండిందని,తెలుగు..తమిళంకు సరిపడేలా...బ్రహ్మానందంను ఆ ప్లేస్ లో తీసుకుంటారు

సీజన్

సీజన్

హర్రర్ సినిమాలకు తెలుగు,తమిళంలో సీజన్ నడుస్తూండటంతో కూడా ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అయ్యే అవకాసం ఇస్తోంది

English summary
Rajinikanth & Nagarjuna eyes on Shivarajkumar starrer Shivalinga! According to the rumor mills Shivalinga will be soon remade in Telugu & Tamil languages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu