»   » 'కిక్' డైరక్టర్ సురేంద్రరెడ్డి నెక్ట్స్ ఆ స్టార్ హీరోతో ...

'కిక్' డైరక్టర్ సురేంద్రరెడ్డి నెక్ట్స్ ఆ స్టార్ హీరోతో ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కిక్' చిత్రంతో తానేమిటో మరో సారి నిరుపించుకున్న సురేంద్రరెడ్డితో హీరో రామ్ చేయనున్న చిత్రం కాన్సిల్ అయిందన్న సంగతి తెలిసిందే. దాంతో దర్శకుడు సురేంద్ర రెడ్డి ఆ కథని మార్చి గోపిచంద్ కి వినిపించాడని సమాచారం. కధ విన్న గోపీచంద్ బాగా ఇంప్రెస్ అయ్యి ప్రాజెక్టు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. శంఖం, గోలీమార్ ఫ్లాఫ్ లతో ఉన్న గోపీచంద్..కథ నచ్చలేదని రీసెంట్ గా బి.గోపాల్ ప్రాజెక్టు కూడా కాన్సిల్ చేసారు. రచయిత బి.వి.యస్ రవి దర్శకుడుగా మారి చేస్తున్న చిత్రం ఒకటే అండర్ ప్రొడక్షన్ లో ఉంది. ఇక సురేంద్రరెడ్డి..యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు కావటంతో గోపీచంద్ కరెక్టుగా నప్పుతాడని, వినోదం కలిసిన యాక్షన్ చిత్రమని చెప్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu