»   » కృతజ్ఞతతో కళ్యాణ్‌రామ్ ని డైరక్ట్ చేస్తాడట

కృతజ్ఞతతో కళ్యాణ్‌రామ్ ని డైరక్ట్ చేస్తాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రీసెంట్ గా పటాస్‌తో మంచి హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్‌రామ్ ఇప్పుడు తన కెరీర్ పై మరింత కేర్ తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. రవితేజ సురేందర్‌రెడ్డిల కలయికతో రూపొందుతున్న ఈ సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అతనొక్కడే సినిమాతో సురేందర్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేసింది కళ్యాణ్‌రామ్. ఇప్పటికే సురేందర్‌రెడ్డి కూడా కళ్యాణ్‌రామ్ హీరోగా ఓ సినిమా చేస్తానని చెప్పినట్టు తెలిసింది. మరి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పటాస్ కు ముందు వరస ఫ్లాఫులు రావటంతో ఇక నుంచి అలాంటి పరిస్ధితి రిపీట్ కాకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తను హీరోగా చేసే సినిమాల కథలు,దర్శకులను ఆచి తూచి ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పిల్లా నువ్వు లేని జీవితం దర్శకుడు రవికుమార్ చౌదరితో సినిమా కమిటయ్యారు. దిల్ రాజు నిర్మాతగ ఈ చిత్రం ఉంటుంది. ఈ లోగా మల్లి దర్శకత్వంలో రూపొందుతున్న షేర్ చిత్రం రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత సురేంద్ర రెడ్డి చిత్రం చేస్తారు. ప్రస్తుతం నిర్మాతగా కిక్-2 సినిమాను నిర్మిస్తున్నాడు.

షేర్ చిత్రం విషయానికి వస్తే..

Surendra reddy again direct Kalyan Ram

మళ్ళీ ఫుల్ ఫాంలోకి వచ్చిన కళ్యాణ్ రామ్ అప్పుడే తన తదుపరి సినిమాతో సిద్దమవుతున్నాడు. కళ్యాణ్ రామ్ చేస్తున్న తదుపరి సినిమా ‘షేర్'. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

పటాస్ సినిమాలనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ ఉంటూనే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

English summary
Director Surendra Reddy wants to direct Kalyan Ram again.
Please Wait while comments are loading...