»   » రేపే రిలీజ్: సూర్య 'రాక్షసుడు' ఇన్ సైడ్ టాక్

రేపే రిలీజ్: సూర్య 'రాక్షసుడు' ఇన్ సైడ్ టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం 'రాక్షసుడు' (తమళంలో మాస్‌). నయనతార హీరోయిన్. ప్రణీత రెండో హీరోయిన్. ఇందులో ప్రేమ్‌జీ, పార్థిబన్‌, సముద్రకని తదితరులు నటించారు. ఈ నెల 29వ తేదీన చిత్రం విడుదల కానుంది. వరుసగా పరాజయాలతో ఇబ్బంది పడుతున్న సూర్య తన ఆశలన్నీ దీనిపైనే పెట్టుకున్నారు. మరి ఈ సినిమా తెలుగులో పరిస్ధితి ఎలా ఉండనుంది అనేదానికి వినపడుతున్న సమాధానం ఏమిటీ అంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ తెలుగు డబ్బింగ్ చిత్రం పెద్ద హిట్ అవకాసం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. యావరేజ్ నుంచి బిలో యావరేజ్ కు ఈ చిత్రం ఉంటుందని చెప్తున్నారు. పూర్తి తమిళ నేటివిటీతో ఈ చిత్రం రూపొందించారని అది తెలుగు వారికి ఎంతవరకూ పడుతుందనేది సందేహమే అంటున్నారు. ఓ రకంగా ఇది ప్రయోగాత్మక చిత్రంలాగ ఉందని, సూర్య హీరోగా చేసిన చిత్రం అని ఎక్సపెక్టేషన్స్ తో వెళ్లేవారికి కొంత ఇబ్బందే అంటున్నారు. అయితే ఇది కేవలం వినపడుతున్న టాక్ మాత్రమే అని గమనించగలరు. ఈ సినిమా యముడులాగ పెద్ద హిట్ కూడా కావచ్చు.

Surya's latest Rakshasudu Inside Talk!

సూర్య మాట్లాడుతూ... ద్విపాత్రాభినయం, దెయ్యం కథ.. ఇలా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయే అన్నదానికి సమాధానం చెప్పారు. ఇందులో నేను ద్విపాత్రాభినయం పోషిస్తున్న విషయాన్ని స్పష్టం చేయలేదు. సినిమానే అందుకు సమాధానం చెబుతుంది.

దెయ్యం, ప్రేతాత్మ.. అని చెప్పడం కన్నా.. ఇదో హర్రర్‌ కామెడీ సినిమా అంతే. కొత్త ప్రయోగం చేశాం. వర్కవుట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. చిన్నారులతోపాటు పెద్ద వారికి కూడా నచ్చే సినిమాగా ఉంటుంది అన్నారు.

తమిళ వెర్షన్ విషయానికి వస్తే....

కొన్ని కారణాల వల్ల ఇటీవల ఈ సినిమా పేరును 'మాసూ'గా మార్చారు. తాజాగా ఆ పేరును కూడా స్వల్పంగా మార్పు చేస్తూ.. 'మాసు'గా పెట్టారు. ఇందులో సూర్య మాసిలామణి' అనే పాత్రలో నటిస్తున్నారు. ఆ పేరుకు ముద్దుగా 'మాస్‌' అని పెట్టుకున్నారు. ప్రభుత్వ నిబంధనల కారణంగా ప్రస్తుతం 'మాసు'గా మారినట్లు తెలుస్తోంది.

English summary
Rakshasudu is in the range of Average to Above Average. The movie has so much of Tamil nativity in it and may be difficult for Telugu audience to connect with. It is kind of an experimental film given Surya's star status.
Please Wait while comments are loading...