»   » త్రివిక్రమ్ తో చేయాలని ఫిక్స్..అందుకే తమిళ హీరో చర్చలు

త్రివిక్రమ్ తో చేయాలని ఫిక్స్..అందుకే తమిళ హీరో చర్చలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ హీరో సూర్యకు తెలుగులో నూ మంచి మార్కెట్ ఉంది. దాంతో ఈ సారి తెలుగు స్ట్రైయిట్ చిత్రం చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగులో లాంచింగ్ చాలా గ్రాండ్ గా ఖచ్చితంగా హిట్ అయ్యేలా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే పూరి జగన్నాథ్, వివి వినాయిక్ లతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే సూర్యని వారు మెప్పించలేకపోయారని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దాంతో ఇప్పుడు సూర్య దృష్టి త్రివిక్రమ్ పై పడిందని, ఆయనతో గత కొద్ది రోజులుగా టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ రెండు సార్లు కలిసారని, త్రివిక్రమ్..స్టోరీ లైన్ ని నేరేట్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని సూర్య తన సొంత బ్యానర్ పై చేయనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు కు సంభదించిన మరిన్ని విశేషాలు బయిటకు వచ్చే అవకాసం ఉంది.

'సింగం', 'సింగం 2' వంటి వరుస హిట్లను అందించిన సూర్య వేగానికి.. 'అంజాన్‌'(సికిందర్) తో కాస్త బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం వెంకట్‌ప్రభు దర్శకత్వంలోని 'మాస్‌' చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. దీని తర్వాత ఆయన విక్రం కె.కుమార్‌, 'అట్టకత్తి' రంజిత్‌, హరి దర్శకత్వంలో నటించనున్నారు. 'మనం' ఫేమ్‌ విక్రంకుమార్‌ చెప్పిన కథ సూర్యకు బాగా నచ్చడంతో తన తదుపరి కాల్షీట్‌ ఆయనకే ఇచ్చినట్లు సమాచారం.

సూర్య నిర్మాణంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరులో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి విక్రంకుమార్‌ '24' అనే శీర్షికను పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్‌, ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది. 'సిల్లెను ఒరు కాదల్‌' తర్వాత ఏఆర్‌ రెహ్మాన్‌... సూర్య నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. గతంలో విక్రంకుమార్‌ దర్శకత్వం వహించిన 'కాలై', 'యావరుం నలం' చిత్రాలకు కోలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించింది.

Surya in talks with Trivikram Srinivas?

మాస్‌, కమర్షియల్‌ చిత్రాలతో నటుడు సూర్య తెలుగు, తమిళంలో మంచి మార్కెట్‌ను సొంతం చేసుకుంటున్నారు. తన ఇమేజీని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఆయన వెంకట్‌ప్రభు దర్శకత్వంలో 'మాస్‌'లో నటిస్తున్నారు. దీని తర్వాత విక్రంకుమార్‌ దర్శకత్వంలో నటించనున్నారు. 'యావరుం నలం' వంటి హర్రర్‌ చిత్రాన్ని అందించిన విక్రంకుమార్‌.. సూర్యకు కూడా అలాంటి కథనే చెప్పినట్లు కోలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఈ సినిమాను సూర్య సొంత బ్యానరైన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. కథ విపరీతంగా నచ్చడంతో.. అందుకు తగిన సంగీత దర్శకుడి వేటలో కూడా పడ్డారు సూర్య. అలా.. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహ్మాన్‌పై తన ఆశలన్నీ పెట్టుకున్నారట. ఇటీవల రెహ్మాన్‌తో ఈ విషయం చర్చించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రెహ్మాన్‌ చాలా బిజీగా ఉన్నారు. పనిభారం కారణంగా ఆయన స్వరాలు సమకూర్చిన 'లింగ' ఆడియో కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు. ఆయన కోసం సూర్య కూడా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబరు ఆఖరులో ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. గతంలో సూర్య నటించిన 'సిల్లెండ్రు ఒరు కాదల్‌'కు రెహ్మాన్‌ స్వరాలు సమకూర్చారు.

English summary
sources say he held talks with Trivikram Srinivas. Buzz is the duo already met twice or thrice and Trivikram even narrated a storyline.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu