»   »  పెళ్ళంటే పిచ్చి కోపం

పెళ్ళంటే పిచ్చి కోపం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sushmita Sen
బాలీవుడ్‌లో వయస్సు మీదపడుతున్నా తన అందాలను అలవోకగా ఆరబోస్తూ నెగ్గుకొస్తున్న భామ సుస్మితాసేన్. ఆమె న్ ఈ మధ్య ఎందుకనో గానీ పెద్దగా ఎవరనీ కలవక,పార్టీలకు అటెండవక దూరంగా ఉంటోంది. కానీ తన పుట్టిన రోజున తన ఆత్మీయ సహచరులందరికీ తన ఇంట్లో పార్టీ ఎరేంజ్ చేసింది. ఇక పార్టీలో అంతా ఖుషీగా తాగి డ్యాన్స్‌లు వేస్తూ.. ఎంజాయ్ చేస్తుంటే ఒక్కసారిగా చెంప ఛెళ్ళుమనే శబ్దం రాగానే అంతా ఉలిక్కిపడి అటువైపు తిరిగారు. ఏమిటని ఆరా తీస్తే.. సుస్మిత ఓ అమ్మడి చెంప వాయించింది.

ఎందుకా అని అంతా మూగితే విషయం తెలిసింది. చెంపదెబ్బ తిన్న ఆమె 34వ యేళ్ళు వచ్చాయి కదా ఇకనైనా పెళ్ళి గురించి ఆలోచించవచ్చుకదా? అని అడిగిందిట.దాంతో ఆమెకు పిచ్చి కోపం వచ్చి చెంప వాయించి, బూతులు కూడా తిట్టిందట. దీంతో పార్టీ వేడిగా ఉందనుకుని నిదానంగా అందరూ జారుకున్నారు. ఆల్‌రెడీ పెళ్ళికాకుండా తల్లి అయిన సుస్మిత.. అదేనండీ.. ఒక బిడ్డను దత్తత తీసుకున్న సుస్మితకు మరీ పెళ్ళంటే అంత కోపమెందుకో అని అందరూ కామెంట్స్ చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X