For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఆట' టీనా మృతిపై అనుమానాలు.. ఆమె మరణం వెనుక అనేక రూమర్లు?

  |

  డ్యాన్స్‌ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్‌ విన్నర్‌, నాలుగో సీజన్ జడ్జ్ టీనా సాధు మరణం అటు ఇండస్ట్రీలోనే కాకుండా సామాన్యులలో కూడా చర్చనీయాంశంగా మారింది. చిన్నవయసులోనే టీనా మరణించడంతో ఆమె మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోవాకు చెందిన టీనా ఆట మొదటి సీజన్‌కు విన్నర్‌గా నిలిచి మంచి పేరు సంపాదించారు. ఆ పేరుతోనే తరువాతి కాలంలో పలు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా కూడా వ్యవహరించారు. ఇక ఆలా ఆమెకు క్రేజ్ రావడంతో షో నాలుగో సీజన్‌కు జడ్జిగా వ్యవహరించమని కోరడంతో ఆమె అలాగే జడ్జ్ గా వ్యవహరించారు. అయితే కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా గోవాలో రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకుని అక్కడే నివసిస్తోందని తెలుస్తోంది.

  ఇక నాలుగైదు రోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చిన టీనా తమ మిత్రురాలు యాంకర్‌ శిల్పాచక్రవర్తిని కలిసిందని, తిరిగి డ్యాన్స్‌ షోల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఉందని మనసులోని మాట బయట పెట్టిందని కూడా పెట్ట ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత గోవా వెళ్లిపోయిన ఆమె ఇంట్లో ఉన్న సమయంలో మద్యం సేవించిందని, అయితే సాధారణం కంటే ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల ఆమెకు గుండెపోటు వచ్చిందని కుటుంబీకులు చెబుతున్నారు అన్నట్టుగా ఓ వార్త వైరల్‌గా మారింది. అయితే దానికి మాత్రం అధికారిక క్లారిటీ లేదు. అయితే ఎంతో ఫిట్‌గా ఉండే టీనా 38ఏళ్ల వయసులోనే మరణించడంతో ఆమె మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టీనా మరణం గురించి బయటకి వెల్లడించిన ఆట సందీప్‌ కూడా అనుమానం వ్య​క్తం చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆట సందీప్‌ మాట్లాడుతూ పలు షాకింగ్‌ విషయాలను షేర్‌ చేసుకున్నారు.

  suspicions on Tina Sadhu death

  టీనా లేదన్న విషయం ఇంకా నమ్మబుద్ధి కావట్లేదన్న సందీప్ . 5 రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఎంతో సరదాగా గడిపిన టీనాకు అంత సడెన్‌గా హార్ట్‌ స్ట్రోక్‌ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదని అన్నారు. నిజానికి ఆమె చాలా ఫిట్‌గా ఉంటుందని అందుకే నాకు ఇది గుండెపోటు అయ్యిండదనిపిస్తుందని సందీప్ అన్నారు. నాతో మాట్లాడినప్పుడు డిప్రెషన్‌లో ఉన్నానని దానికి కారణం. పర్సనల్‌ లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌ ఉండడమే అని ఆమె చెప్పిందని ఆయన చెప్పుకొచ్చారు. మరో మారు కలిసినప్పుడు ఆ ప్రాబ్లంస్ గురించి మాట్లాడతానని ఆమె చెప్పింది. కానీ ఇంతలోనే ఆమె చనిపోయిందని, అందుకే అది చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది అని సందీప్ పేర్కొన్నారు. ముందు నుంచే అనేక అనుమానాలు ఉండగా ఇప్పుడు ఈ దెబ్బతో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. ఆమె కుతుమ సభ్యులు ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ ఈ విషయం మీద వార్తలు ఆగేలా కనపడడం లేదు.

  English summary
  as per social media suspicions on Tina Sadhu death started
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion