Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అప్పటి నుంచి టెన్షన్ లో సుకుమార్.. అండగా నిలిచిన భార్య!
మ్యాథ్స్ లెక్చరర్ గా కెరీర్ ప్రారంభించిన సుకుమార్ తర్వాత కాలంలో దర్శకుడిగా మారి అనేక సంచలన విజయాలు అందుకున్నాడు. ఇప్పటికీ ఆయన సినిమా వస్తుందంటే అందరి కళ్ళు సినిమా మీద ఉంటాయి. అయితే కొద్ది కాలంగా సుకుమార్ టెన్షన్ లో ఉన్నారు. తాజాగా ఆయన భార్య సుకుమార్ టెన్షన్ తీరేలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

టాప్ డైరెక్టర్ గా
ఎక్కడో గోదావరి జిల్లాల్లో మ్యాథ్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న సుకుమార్ సినిమా రంగం మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చారు. రచయితగా పనిచేయడం ప్రారంభించి దర్శకుడు మోహన్ మరియు వి.వి.వినాయక్ లకు సహాయ దర్శకుడిగా పని చేశారు . ఇక ఆర్య సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన ఒకటి అరా సినిమాలు అందుకున్న కానీ ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

స్నేహితుడిని మేనేజర్ ని చేసి
అయితే ఇండస్ట్రీలోకి వచ్చి కొంచెం స్థిరపడ్డాక ఆయన తన స్నేహితుడు ప్రసాద్ అనే ఒకరిని హైదరాబాద్ తీసుకు వచ్చారు. తీసుకు వచ్చి తనకు మేనేజర్ గా ఆయనను నియమించుకోవడమే కాక నిర్మాతను కూడా చేశారు సుకుమార్. కానీ అనుకోని రీతిలో గత ఏడాది ప్రసాద్ గుండెపోటుతో మరణించారు.

అన్నీ ఆయనే
ఒక
రకంగా
చెప్పాలంటే
సుకుమార్
చేస్తున్న
అన్ని
సినిమాలకు
ప్రసాద్
ప్రొడక్షన్
విషయంలో
జాగ్రత్తలు
తీసుకునేవారు.
అలాగే
చనిపోయే
ముందు
ఆయన
అమరం
అఖిలం
ప్రేమ
అనే
సినిమాను
కూడా
నిర్మించారు.
ప్రసాద్
బతికున్నంత
వరకు
సుకుమార్
కి
సంబంధించిన
ఆర్థిక
వ్యవహారాలు
సహా
పిఆర్
వ్యవహారాలు
కూడా
ఆయనే
చూసుకునే
వారు.

టెన్షన్ లో సుకుమార్
అదీకాక
తనలాంటి
కొత్త
టాలెంట్
ను
ఎంకరేజ్
చేయడానికి
గాను
సుకుమార్
రైటింగ్స్
పేరుతో
ఒక
బ్యానర్
ఏర్పాటు
చేశారు.
ఆ
బ్యానర్
వ్యవహారాలు
కూడా
ప్రసాద్
చూసుకునేవారు.
కానీ
ఆయన
మరణించాక
ఆ
బాధ్యతలు
ఎవరికి
అప్పగించాలి
అనే
విషయం
తెలియక
సుకుమార్
టెన్షన్
పడుతున్నారు
అని
తెలుస్తోంది.
Recommended Video

ఆ బాధ్యతలు అన్నీ ఆమెకే
ఈ నేపథ్యంలో సుకుమార్ భార్య తబిత ఆ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ సహా సుకుమార్ ఆర్థిక వ్యవహారాలు కూడా ఆమె చూసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజెస్ అనే సినిమా తెరకెక్కుతోంది