»   » మహేష్'1' ట్యాగ్ లైన్ లేపేస్తున్నారా?

మహేష్'1' ట్యాగ్ లైన్ లేపేస్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మహేశ్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌కు ఏం టైటిల్ పెడుతున్నారనే ఉత్కంఠకు మొత్తానికి రెండు రోజుల క్రితం తెరపడింది. దీనికి '1' అనే టైటిల్ ఖరారు చేశారు. 'నేనొక్కడినే' అనేది ఉప శీర్షిక ని పెట్టారు. ఇప్పుడు ఆ ట్యాగ్ లైన్ ని లేపేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

దీనికి సినిమా టైటిల్ జనాల్లోకి సరిగ్గా వెళ్లలేదని మహేష్ ఫీలవుతున్నాడని తెలుస్తోంది. '1' టైటిల్ ని ఫాలో అవ్వాలా.. 'నేనొక్కడినే' అనేది ఫాలో అవ్వాలా అనేది కన్ఫూజ్ అవుతున్నారని,ప్యాన్స్ నుంచి సమాచారం వచ్చిందని, దాంతో ఈ ట్యాగ్ లైన్ ని లేపేసే ఆలోచన చేసారని చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క టీజర్ లో డైలాగ్స్ లేకపోవటం కూడా నిరాసపరిచిన అంశం.

ఇక ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అయ్యింది. అప్పట్నించీ ఈ సినిమాకి రకరకాల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. మహేశ్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న టైటిల్‌ను ప్రకటించారు. ఇదే రోజు టీజర్‌నూ విడుదల చేశారు. అయితే ఈ టీజర్‌లో మహేశ్ ముఖం స్పష్టంగా కనిపించకపోవడం గమనార్హం.
"ఫస్ట్‌లుక్‌కీ, టీజర్‌కీ వచ్చిన స్పందనకి చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడానికి టీమ్ మొత్తం నిజంగా చాలా శ్రమిస్తోంది. నా కెరీర్‌లో ఇది మరో మైలురాయి అవుతుంది'' అని ట్వీట్ చేశారు మహేశ్.

ఇందులో ఆయన సరసన హీరోయిన్ గా మోడల్ కృతి సనన్ పరిచయమవుతోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేశ్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు కూర్చడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

సల్మాన్‌ఖాన్ సినిమా 'ఏక్ థా టైగర్'కు పనిచేసిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లు కాన్రాడ్, మార్కోస్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇందులో మహేశ్ సిక్స్‌ప్యాక్ బాడీతో మొదటిసారి షర్టువిప్పి కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ లో కూడా ఆ లుక్ కనపడింది.

English summary

 Sources say that Mahesh Babu wants to remove ... tag line Nenokkadine from latest film '1' which is directed by Sukumar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu