»   » 'బధరీనాద్' హీరోయిన్ గా హన్సికని తీసేసి..

'బధరీనాద్' హీరోయిన్ గా హన్సికని తీసేసి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, వివి వినాయిక్ కాంబినేషన్ లో 'బధరీనాద్' హీరోయిన్ గా మొదట అనుకున్న హన్సికను తీసేసి తమన్నా కన్ఫర్మ్ చేసారు. హ్యాపీడేస్ తర్వాత తెలుగులో అంత చెప్పుకోదగ్గ సినిమా చేయని ఆమె ఈ చిత్రంతో తెలుగులోనూ స్టార్ హీరోయిన్ అవుతానని ఆశిస్తోంది. ఇక ఇప్పటికే తమన్నా తమిళనాట ఫ్యాన్స్ ను ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మించే ఈ చిత్రం భారీ గా ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి కథను చిన్న కృష్ణ చాలా గ్యాప్ తర్వాత అందిస్తున్నాడు. అలాగే అదుర్స్ తో తానేంటో మరోసారి చాటి చెప్పిన వివి వినాయిక్ దర్శకుడు కావటంతో అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అల్లు అర్జున్ వేదం అనంతరం మార్చిలో చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతుంది. ప్రస్తుతం గుణశేఖర్ తో చేసిన వరుడు ప్రమోషన్ కు అల్లు అర్జున్ ప్లాన్ చేసుకుంటున్నాడు. మొదటి ఈ పాత్రలో హన్సిక ను అనుకున్నారు కానీ ఆమె ఎక్కువ రెమ్యునేషన్ కోట్ చేయటంతో ఆమెను కాదనుకుని తమన్నాని తీసుకున్నారు. అలాగే గీతా ఆర్ట్స్ వారు సుకుమార్ దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా చేస్తున్న చిత్రంలోనూ తమన్నానే ఎంపిక చేసారన్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu