»   » 'బాహుబలి' ఎఫెక్ట్: బ్యాచులర్ బోయ్స్ దగ్గర గట్టిగా వసూలు

'బాహుబలి' ఎఫెక్ట్: బ్యాచులర్ బోయ్స్ దగ్గర గట్టిగా వసూలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నిన్నటి వరకు ఓ స్దాయి హీరోయిన్ తమన్నా. 'బాహుబలి' లో నటించటంతో ఒక్కసారిగా టాప్ లోకి వెళిపోయింది. ఆ తర్వాత బెంగాల్ టైగర్ మరియు ఊపిరి లాంటి పెద్ద సినిమాలతో బిజి అయిన, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న స్పీడున్నోడు సినిమాలో ఓ ఐటం సాంగ్ లో చేసింది.

ఈ సినిమాలో ఐటం చేసినందుకు గాను సుమారు కోటిరూపాయలపైగా రూపాయల పారితోషికం ముట్టిందని సమాచారం. కేవలం ఒకపాటకే అంతరేటా అంటే ..తమన్నా తనకు ఉన్న క్రేజ్ అలాంటిది అని ముక్కు పిండి మరీ వసూలు చేసిందంటున్నారు. ఈ పాట మొత్తానికి రెండు కోట్లు నిర్మాతలు ఖర్చు పెట్టారు.

Tamanna costed 2 crore for title song

'బ్యాచులర్ బోయ్స్' అంటూ సాగే ఈ ఐటం సాంగ్ సినిమాలో హైలెట్ అవుతుందంటున్నారు. ఈ పాటకు ఇంత రెమ్యునేషన్ అడిగింది కాబట్టి...పాటకు సంబందించి కాస్ట్యూమ్స్, మేకప్ మెదలైనవన్ని తమన్నే చూసుకోవాలని కండీషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ పాట అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, తాము పెట్టిన రెండు కోట్లుకు రెట్టింపు వస్తుందని హ్యాపీగా ఉన్నారు దర్శక,నిర్మాత భీమినేని. ఈ సినిమాను తన సొం నిర్మాణంలోనే నిర్మిస్తున్నారు బీమినేని శ్రీనివాస్. తమిళ సుందరపాండియన్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం తెలుగులో ఏ వరకు హిట్ అవుతుందో చూడాలి మరి.

English summary
Tamanna's 'Bachelor Boys' dance number in 'Speedunnodu' cost exactly, Rs 2 crore .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu