»   » తమన్నా ఇంకో ఐటం సాంగ్..ఈ సారి ఆ కుర్ర హీరోకే

తమన్నా ఇంకో ఐటం సాంగ్..ఈ సారి ఆ కుర్ర హీరోకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమన్నా మరోసారి ఐటం సాంగ్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని విశ్వసనీయ సమాచారం. తమన్నా ఇన్నాళ్ళ కెరీర్లో ఐటం సాంగ్ లు,స్పెషల్ సాంగ్ చేసింది లేదు. అయితే తొలిసారి... ఆమధ్య 'అల్లుడు శీను' సినిమాలో ఐటం సాంగ్ చేసి అదరకొట్టింది. అప్పట్లో తమన్నా నిర్ణయం చూసి అప్పట్లో అంతా షాక్‌ అయ్యారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దానికి తగినట్లే ... ఆ పాటలో తమన్నా అదరకొట్టింది. కానీ ఆ తర్వాత మళ్లీ ఎంత మంది అడిగినా ఐటెమ్‌ పాట చేసింది లేదు. పలువురు దర్శకనిర్మాతలు సంప్రదించినా నో చెప్పింది. హీరోయిన్ గా చేయాల్సిన చిత్రాలే బోలెడన్ని ఉన్నాయంటూ ఆ అవకాశాల్ని తిరస్కరించింది.

Tamanna Item Song in Bellamkonda Srinivas Second film

కానీ ఇప్పుడామె మరోసారి స్పెషల్ సాంగ్ కు పచ్చజెండా వూపినట్టు సమాచారం. ఈసారి కూడా అల్లుడు శీను బెల్లకొండ శ్రీనివాస్‌తోనే ఆడిపాడబోతోందట. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.

తమిళంలో విజయంతమైన 'సుందరిపాండ్యన్‌' ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'స్పీడున్నోడు' అనే పేరు ప్రచారంలో ఉంది. అందులో తమన్నా ప్రత్యేకగీతం చేస్తున్నందుకుగానూ భారీగా పారితోషికం అందుకొంటోందట.

తెలుగులో రీమేక్‌ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు... భీమనేని శ్రీనివాసరావు. ఇదివరకు ఆయన తీసిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. రెండు సంవత్సరాల క్రితం కిందట నరేష్‌తో 'సుడిగాడు' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. తాజాగా ఈ సినిమాను రూపొందించి విడుదలకు సన్నాహాలు చేసుకొంటున్నారు.

తమిళంలో విజయం సాధించిన 'సుందర పాండ్యన్' రీమేక్ హక్కులను గట్టి పోటీని ఎదుర్కొని తన స్వంతం చేసుకున్నారు 'భీమనేని'. ఈ చిత్రాన్నే తెలుగులో ఆయన స్వీయ దర్శకత్వంలో పునర్నిస్తున్నారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉండే ఈ చిత్రాన్ని తమిళంలో దర్శకుడు, హీరో కూడా అయిన 'శివ' నటించగా, ఆయన వద్ద దర్శకత్వ శాఖలో సహాయకునిగా పనిచేసిన ఎస్.ఆర్.ప్రభాకర్ 'సుందర పాండ్యన్'ను తెరకెక్కించారు.

English summary
Tamanna is going to do second item song with Bellamkonda Srinivas. According to the reports she will be seen as an item girl in Bellamkonda Srinivas upcoming movie which is the remake of Tamil Super hit movie Sundar Pandian. The director of the film is Bhimineni Srinivas. Till now this is going to be her second item song in her career.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu