»   » రవితేజ సరసన తమన్నా ఖరారు

రవితేజ సరసన తమన్నా ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'ఆగడు' చిత్రం తో బిజీగా ఉన్న తమన్నా మరో చిత్రం సైన్ చేసింది. సురేంద్రరెడ్డి దర్సకత్వంలో రూపొందనున్న కిక్ చిత్రం సీక్వెల్ ని ఆమె ఓకే చేసిందని తెలుస్తోంది. కిక్ 2 లో రవితేజ సరసన ఆమె అల్లరి చేసే పాత్రలో కనిపించనుంది. వీరిద్దరి రొమాన్స్ తొలిసారి కావటంతో మంచి ఎక్సపెక్టేషన్స్ ఉండే అవకాసం ఉంది.

కిక్ చిత్రం రవితేజ కెరీర్ కు కిక్ ఇచ్చింది. అప్పటివరకూ ఓ రకంగా నడుస్తున్న రవితేజ కెరీర్ కిక్ తో మరింత విజృంభించింది. రవితేజ, ఇలియానా కాంబినేషన్లో సురేంద్రరెడ్డి రూపొందించిన ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సీక్వెల్ లోనూ రవితేజ హీరోగా చేస్తున్నారు. మరో హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతుంది. 2014 జూన్ నెలలో ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఆ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులనే ఈ చిత్రానికి తీసుకోనున్నారు.

Tamanna and Raviteja pairs up first time

ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తై పోయిందని త్వరలోనే భారీగా ఓపినింగ్ జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఈ సీక్వెల్ లో కేవలం క్యారెక్టరైజేషన్ కంటిన్యూ అవుతుందని అంటున్నారు. అందులో హీరో పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత కిక్ సినిమా ముగుస్తుంది. కాబట్టి సీక్వెల్ లో పోలీస్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా ఎవరనేది ఫైనల్ కాలేదు. అలాగే బ్రహ్మానందం హల్వా రాజ్ పాత్ర కొత్త మెలికతో అదరకొడుతుందని అంటున్నారు. అయితే ఈ కథలో మంచి లవ్ స్టోరి ఉండేలా తయారు చేస్తున్నారని సమాచారం.


ఇన్నాళ్లూ తనలోని గ్లామర్ కోణాన్ని ఆవిష్కరించిన తమన్నా త్వరలో తనలోని నటిని బయిటపెట్టనున్నది. దర్శకుడు బాలా చిత్రంలో ఆమె ఎంపికైంది. బాలా చిత్రాలంటే తెలుగు,తమిళ భాషల్లో ఉన్న క్రేజే వేరు. ఆయన తన తదుపరి చిత్రానికి సిద్దమవుతున్నారు. హీరోగా విశాల్‌ ని ఎంచుకున్నారు. మాస్ హీరో విశాల్ మరోసారి బాలా దర్శకత్వంలో నటించనున్నారు. ఆయనకు జంటగా తొలిసారి తమన్నా ఆడిపాడనుంది. దాంతో తమన్నాకు మంచి ఛాన్స్ వచ్చిందని అంటున్నారు.

విశాల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం 'అవన్‌-ఇవన్‌'(వాడు - వీడు). బాలా తెరకెక్కించిన ఇందులో మెల్లకన్నుతో నటించి తనలోని వైవిధ్య నటుణ్ని బయటపెట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి బాలా దర్శకత్వంలో కనిపించనున్నారీ టాల్‌హీరో. దీనికి సంబంధించిన చర్చలు కూడ వీరి మధ్య పూర్తయ్యాయని, త్వరలోనే సెట్స్‌పైకి చిత్రం వెళ్లనున్నట్లు సమాచారం.

తన గత చిత్రాలన్నీ వైవిధ్య కథలతో తెరకెక్కించిన బాలా... దీన్ని పూర్తిస్థాయి హాస్య ప్రధానంగా తీర్చిదిద్దనున్నారట. అందుకే ఇందులో హీరోయిన్‌గా తమన్నాను ఎంపిక చేశారని సమాచారం. హీరోకి తెరపై తిరుగులేని గుర్తింపు ఇస్తాడని దర్శకుడు బాలాకు పేరు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. సూర్య, విక్రం.. వంటి వారికి అలా మంచి సినీ జీవితాన్ని ప్రసాదించాడీ విలక్షణ దర్శకుడు. ప్రతిఒక్కరిలో అసలైన నటుణ్ని వెలికితీసే సత్తా ఆయనలో ఉంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం విశాల్ కు మరోసారి వరించినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 'పరదేశి'తో మరో వాస్తవిక దృశ్యకావ్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలా.

English summary
Tamanna has bagged a new film in her kitty. If the grapevine is to believe Surender Reddy is getting ready to direct the sequel of his biggest hit ‘Kick’ and he has approached Tamanna for female lead role. So get to see the romance of Ravi Teja and Tamannaah on screen for the first time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu