»   » తమన్నా ముప్పుతిప్పలు పెడుతున్నదట .. మిల్కీబ్యూటీతో ఆ హీరో బేజార్..

తమన్నా ముప్పుతిప్పలు పెడుతున్నదట .. మిల్కీబ్యూటీతో ఆ హీరో బేజార్..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Tamannaah Neglects Kalyan Ram For Vikram

బాలీవుడ్‌లో పాగా వేసేందుకు తీవ్రం ప్రయత్నిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా‌కు టాలీవుడ్‌లో సక్సెస్ లేక చాలా రోజులే అవుతున్నది. ప్రస్తుతం టాలీవుడ్‌లో తమన్నాకు హిట్ కంపల్సరీగా మారింది. ప్రస్తుతం క్వీన్ రీమేక్‌తోపాటు కల్యాణ్ రామ్‌తో నా నువ్వే అనే సినిమా చేస్తున్నది తమన్నా. అయితే ఈ రెండు సినిమాల విషయంలో తమన్నాను కొన్ని వివాదాలు చుట్టుమట్టాయనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.

 క్వీన్ దర్శకుడితో కోల్డ్‌వార్

క్వీన్ దర్శకుడితో కోల్డ్‌వార్

హిందీలో విజయం సాధించిన క్వీన్ దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ రీమేక్ అవుతున్నది. తెలుగులో కంగనా రనౌత్ మెప్పించిన పాత్రను తమన్నా పోషిస్తున్నది. అయితే ఆ చిత్ర దర్శకుడికి తమన్నాకు మధ్య ఏదో కోల్డ్‌వార్ నడుస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి.

 కల్యాణ్ రామ్‌తో నా నువ్వే చిత్రం

కల్యాణ్ రామ్‌తో నా నువ్వే చిత్రం

క్వీన్ వివాదంపై క్లారిటీ రాకముందే తమన్నాను మరో వివాదాస్పద అంశం చుట్టుముట్టింది. కల్యాణ్ రామ్‌తో కలిసి నటిస్తున్న నా నువ్వే సినిమా షూటింగ్‌కు సరిగా హాజరుకాకపోవడం వలన ప్రాజెక్ట్ లేటు అవుతున్నట్టు సమాచారం. తమన్నా వ్యవహారమే సినిమా రిలీజ్‌కు ఆలస్యమనే అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 తమన్నాతో ఇబ్బందులు

తమన్నాతో ఇబ్బందులు

నా నువ్వే చిత్రానికి పీసీ శ్రీరాం లాంటి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వర్క్ పనిచేస్తున్నారు. అయితే తమన్నా సెట్‌కు ఎప్పుడొస్తుందో అని వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదట. తమన్నా ప్రొఫెషనల్‌గా వ్యవహరించడం లేదని చిత్ర యూనిట్ మండిపడుతున్నదట.

 స్కెచ్ ప్రమోషన్‌లో బిజీగా

స్కెచ్ ప్రమోషన్‌లో బిజీగా

నా నువ్వే సినిమా ప్రమోషన్‌ను పక్కన పెట్టి విక్రమ్‌తో కలిసి నటించిన స్కెచ్ సినిమా ప్రమోషన్‌లో తమన్నా బిజీగా మారిందట. దాంతో నా నువ్వే షూటింగ్‌కు ఇబ్బందికరంగా మారిందనే యూనిట్ సభ్యులు చెప్పుకొంటున్నారు.

 దర్శకుడిగా యాడ్ ఫిల్మ్ మేకర్

దర్శకుడిగా యాడ్ ఫిల్మ్ మేకర్

ఫిబ్రవరి మూడో వారానికైనా తమన్నాతో కలిసి ఉన్న సీన్లను పూర్తి చేయాలనే ఉద్దేశంతో యూనిట్ ముందుకెళ్తున్నదట. ఈ చిత్రానికి ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కూల్ బ్రీజ్ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతున్నది.

English summary
Now Tamannaah Bhatia working with two movies in Tollywood. She pairing with Kalyan Ram. Reports suggest that, Tamannaah is behaving like unprofessional manner. So The movie got delayed in finishing. The movie is directed by the famous Ad filmmaker Jayendra and it is produced by Cool Breeze Cinemas banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu