»   » ఇప్పుడిక ఫుల్ మీల్స్ : రీమేక్ లో హీరోయిన్ గా తమన్నా

ఇప్పుడిక ఫుల్ మీల్స్ : రీమేక్ లో హీరోయిన్ గా తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమన్నా మరో చిత్రం కమిటైనట్లు సమాచారం. బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందనున్న రెండవ చిత్రంలో హీరోయిన్ గా ఆమె చేయబోతోందని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం 2012లో తమిళంలో వచ్చి హిట్టైన సుందర పాండ్యన్ తమిళ చిత్రం రీమేక్. ఈ చిత్రం తమిళ వెర్షన్ లో లక్ష్మీ మీనన్ ఆ పాత్రను పోషించింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక తమన్నా ..సాయి తొలి చిత్రం అల్లుడు శ్రీను లో ఐటం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. దర్శకుడు భీమినేని తెలుగు నేటివిటీ కోసం స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారు. ఏప్రియల్ నుంచి చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది.

Tamannaah in ‘Sundarapandian’ remake?

రీమేక్ చిత్రాల దర్శకునిగా పేరు తెచ్చుకున్న ‘భీమనేని శ్రీనివాసరావు' సుడిగాడు చిత్రంతో మరోమారు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తరువాత ఆయన మరోమారు రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించటానికి సిద్ధమవుతున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘సుందర పాండ్యన్' రీమేక్ హక్కుల గట్టి పోటీని ఎదుర్కొని తన స్వంతం చేసుకున్నారు భీమనేని.

ఈ చిత్రాన్నే తెలుగులో ఆయన స్వీయ దర్శకత్వంలో పునర్నిర్మించ నున్నారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉండే ఈ చిత్రంను తమిళంలో దర్శకుడు మరియు హీరో అయిన శశి కుమార్ నటించగా, ఆయన వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన ఎస్.ఆర్.ప్రభాకర్ ‘సుందర పాండ్యన్'ను తెరకెక్కించారు.

    English summary
    Tamannaah will once again sizzle beside Bellamkonda Sai Srinivas in the young actor’s second film.Director Bheemnaneni Srinivasa Rao will be helming this Telugu remake of the 2012 Tamil hit ‘Sundarapandian’.
    Please Wait while comments are loading...