»   » "ఒక మనసు" హక్కులు కొన్న ధనుష్..!? తమిళ్ లో కూడా నిహారికేనా..!!?

"ఒక మనసు" హక్కులు కొన్న ధనుష్..!? తమిళ్ లో కూడా నిహారికేనా..!!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెహా హీరోయిన్ నిహారిక, నాగ శౌర్య జంటగా నటించిన ఒక మనసు మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అయితే మరీ పెద్ద కమర్షియల్ హిట్ మాత్రం కాక పోవటం మాత్రం మైనస్సే. అయితే జయాపజయాల సంగతి పక్కన పెడితే నిహారిక కి మాత్రం పాస్ మార్కులకన్నా ఎక్కే వచ్చాయి. నాగ శౌర్య కూడా ఎప్పటి మాదిరే తన స్టయిల్ ఆఫ్ స్మూత్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా తమిళ హీరో, సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ ని విపరీతంగా ఆకట్టుకుందని తెలుస్తోంది. ఈ సినిమా రీమేక్ లో నటించాలని ధ‌నుష్ భావిస్తున్నాడ‌ని.. రీమేక్ హ‌క్కుల కోసం ధ‌నుష్ చ‌ర్చ‌లు స్టార్ట్ చేశాడ‌ని.. ఈ చ‌ర్చ‌లు ఫైన‌ల్ స్టేజ్‌లో ఉన్నాయ‌ని తెలుస్తోంది. సినిమాలో ల‌వ్‌స్టోరీ, పొలిటిక‌ల్ మిక్సింగ్ ధ‌నుష్‌కు బాగా న‌చ్చేసింద‌ట‌. పైగా ఎండింగ్ కూడా విషాదాంతం కావటం తో తమిళ ప్రేక్షకులకి బాగా ఎక్కుతుందనే భావిస్తున్నార్రు.


Tamil Hero Dhanush likes Oka Manasu Movie and he wants to remake it

ఇప్ప‌టికే ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను ధ‌నుష్ సొంతం చేసుకున్నాడ‌ని వార్తలు వచ్చాయి. మెగా ష్యామిలీ నుంచి వ‌చ్చిన నిహారిక న‌టించిన ఈ సినిమాలో ధ‌నుష్ న‌టిస్తాడా లేక త‌న బ్యాన‌ర్ లో వేరే హీరో తో చేస్తాడో ప్ర‌స్తుతానికైతే తెలీదు.


కథలో తమిళ నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి, మంచి కమర్షియల్ సినిమా గా భారీ బడ్జెట్ తో భారీగా ఈ చిత్రాన్ని త‌మిళ్‌లో తెర‌కెక్కించాల‌ని ధ‌నుష్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.ఇదే గనక నిజమైతే తమిళ ప్రేక్షకు నిహారికని నెత్తిన పెట్టుకుంటారు. ఎందుకంటే తమిళులు విషాదాంత ప్రేమకథలని ఎక్కువ ఇష్టపడతారు. అందుక్లోనూ ఒక మనసులో నటనకి తెచ్చుకున్న నిహారిక ఇప్పుడు రెండో సారికి ఖచ్చితంగా ఆ పాత్రకి ప్రాణం పోస్తుంది. ఇక ధనుష్ సంగతి చెప్పేఅ పనే లేదు... చూద్దాం మరి ఏం జరుగుతుందో...

English summary
Actor Dhanush, who is presently shooting for his upcoming trilogy Vada Chennai, will be playing the lead role in the Tamil remake of Oka Manasu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu