Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 2 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 3 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆయన 'పక్క' న అవకాశం నా అదృష్టంగా భావిస్తున్నాను..!
నందమూరి బాలయ్య బాబు ఏమి చేసినా అది అందమే. సింహా తర్వాత నందమూరి బాలకృష్ణ మరో కొత్త చిత్రంలో నటించనున్నారు. ఈ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు వంటి అతిరథ మహారధులు హాజరయ్యారు. బాలయ్యపై తీసిన ముహూర్తపు షాట్ కు చంద్రబాబు నాయుడు క్లాప్ నివ్వగా, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పరుచూరి మురళి దర్శకత్వంలో నటించే కొత్త చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని డాక్టర్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇందులో ఒకరు సిమ్రాన్ కాగా, మిగిలిన ఇద్దరు ప్రణీత, స్నేహా ఉల్లాల్ లను ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలో నమిత, నయనతార, స్నేహా ఉల్లాల్ లతో బాలయ్య నటించిన సింహా చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో, అదే సెంటిమెంట్‌తో ఇంకా టైటిల్ ఖరారు కాని కొత్త చిత్రంలో ముగ్గురు భామలతో కలసి నటించడం బాలకృష్ణకు కలిసొస్తుందని ఫిలిమ్ సిటివర్గాల సమాచారం. ఈ విషయంపై ప్రణీత మాట్లాడుతూ బాలకృష్ణ గారి సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు.
ప్రస్తుతం బాలయ్య బాబు దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో పరమవీరచక్ర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కులు మనాలిలో కొన్ని మిలిటరీకి సంబంధించిన సన్నివేశాలను తీయడం జరుగుతుంది. దాదాపుగా బాలయ్య బాబు నటిస్తున్న పరమవీరచక్ర 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని ఇటీవలే యూనిట్ సభ్యులు వెల్లడించడం జరిగినది. ఇదేవిధంగా పరుచూరి మురళీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రం కూడా క్రేజీ ప్రాజెక్టు అవుతుందని బాలయ్య బాబు అభిమానులు అందరూ అందరూ అనుకుంటున్నారు. పెదబాబు, ఆంధ్రుడు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన పరుచూరి మురళి బాలయ్యను విభిన్న గెటప్‌తో ప్రేక్షకులకు చూపించనున్నారు. అంతేకాకుండా పరుచూరి మురళి దర్శకత్వంలో బాలయ్య బాబు త్రిపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. తాతగా, తండ్రిగా, కొడుకుగా మూడు తరాలను ప్రతిభింబించే ఈ పాత్ర డిజైన్స్ ని కంప్యూటర్ లో తయారుచేసుకుని బాలయ్యచేత ఓకే చేయించుకుని ఆ గెటప్స్ రెడీ చేసే పనిలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 25న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సమ్మర్ లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఊటీలో కానీ మౌంట్ ఆబులో కానీ చిత్రం షూటింగ్ ఉంటుందని దర్శకుడు పరుచూరి మురళి వివరించారు. ఈ సినిమాని శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మాకుమార్ చౌదరి నిర్మించునున్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా స్టిల్స్ కోన్ని బాలయ్య బాబు అభిమానులను సైతం ముక్కున వేలువేసుకోనే విధంగా ఉన్నాయని సినీ పండితులు అనుకుంటున్నారు.