»   » వెరైటీ ఏమోగానీ పేరేదో కాస్త తేడాగానే ఉంది... ఎన్టీఆర్ "దఢ్కన్" మీద ఇంకోసారి ఆలోచించాలేమో

వెరైటీ ఏమోగానీ పేరేదో కాస్త తేడాగానే ఉంది... ఎన్టీఆర్ "దఢ్కన్" మీద ఇంకోసారి ఆలోచించాలేమో

Posted By:
Subscribe to Filmibeat Telugu

మనోళ్లకి టైటిళ్ళు దొరకటం లేదో లేక మరీ వెరైటీ అనుకుంటున్నారో గానీ తెలిసి తెలిసీ ఒక రకమైన టైటిల్స్ మీదే దృష్టి పెదుతున్నారు. ఇప్ప్టికే ఖైదీ నెం.150 అంటూ వచ్చిన మెగాస్టార్ సినిమా టైటిల్ బ్యాడ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. ఈ నెగెటివ్ టాక్ ఎక్కడిదాకా వెళ్ళిందీ అంటే ఈ పేరుని మార్చి మళ్ళీ వేరే పేరుని పరిశీలిస్తున్నారట. ఎనభైలలో వచ్చిన కొన్ని సినిమాల పేర్లు బాగానే ఉన్నా అప్ప్ట్లో అవి మంచి హిట్ సినిమాలు కావటం తో ప్రేక్షకులు ఇంకా ఆ సినిమాలని అడపాదడపా చూస్తూనే ఉన్నారు. అందుకే అవి మరీ పాత టైటిల్స్ లా అనిపించక పోవటం తో కొత్త సినిమాకీ అదే టైటిల్ ని ఎంచుకునేటప్పటికి దాన్ని అంగీకరించలేకపోతున్నారు.

tarak's Next movie Titled As Dhadkan

ఇప్పుడు అదే పద్దతిని ఎన్టీఆర్ కూడా తన కొత్త సినిమాకి వాడుతుండటం తో ఆ టైటిల్ కూడా కాస్త నెగెటివ్ టాక్ తెచ్చుకునేలాగే ఉంది. 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్. వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.. అయితే ఈ సినిమాకి "దడ్కన్" అనే పేరు పెట్టనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

సినిమా అనౌన్స్ చేసే రోజే ఈ టైటిల్ ని కూడా అధికారికంగా ప్రకటించనున్నారట. తెలుగు సినిమాలలో హిందీ పదాలతో, పూర్తి స్థాయి హిందీ పాటలతోనూ ప్రయోగాలు జరిగాయి. హిందీ టైటిళ్ళు వాడటం కూడా జరిగింది. "దిల్" అనే నిథిన్ సినిమా ఎంత హిట్టో మనకు తెలుసు. కానీ ఆ పదాలన్నీ మామూలుగా మనకు తెలిసినవే. కానీ ఈ దడ్కన్ అనే మాట మాత్రం మరీ హిందీ తెల్సిన వాళ్ళకి తప్ప పెద్ద పరిచయం లేదు.

ఇదే టైటిల్ తో 90 లలో అక్షయ్ కుమార్-సునీల్ శెట్టి-శిల్పాశెట్టి ప్రధాన పాత్రల్లో హిందీలో ఈ పేరుతో ఓ సినిమా వచ్చింది. దడ్కన్ అంటే.. హిందీలో హృదయ స్పందన అని అర్థం. తెలుగులోనూ పాపులర్ అయిన హిందీ పేర్లేమైనా పెట్టుకోవచ్చు కానీ.. అసలు సామాన్య జనానికి అర్థమేంటో కూడా తెలియని పదాన్ని ఎన్టీఆర్ సినిమాకు టైటిల్‌గా ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు. ఇదే టైటిల్ పక్కా అనుకుంటున్నారో లేదంటే ఓసారి సొపందన ఎలా ఉంటుందో చూద్దామని ముందే లీక్ చేసారో అర్థం కావటం లేదు కానీ ఈ టైటిల్ మాత్రం అస్సలు పాజిటివ్ గా అనిపిమంచటం లేదు...

English summary
As per the official buzz from Nandamuri Kalyan Ram production house NTR Arts, the next assignment Tarak agreed for is tentatively titled as "Dhadkan"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu