ముమైత్ అభిమానుల ఆవేదన

అందులోనూ ఆమె హీరోయిన్ గా చేసిన రెండు సినిమాలు రిలీజుకు రెడీ గా ఉన్నాయి. అందులో ఒకటి 'పున్నమి నాగు' . చిరంజీవి, మాధవి కలిసి నటించిన 'పున్నమినాగు' ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. మళ్లీ అదే టైటిల్‌తో ఏస్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి సినిమాని నిర్మిస్తున్నారు. ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. అలాగే ఆమె ప్రధాన పాత్రలో నటించిన మరో చిత్రం 'టార్గెట్'. ఇందులో ఆమె 'బేసిక్ ఇన్‌స్టింక్ట్' లో షరాన్ స్టోన్ తరహా కేరెక్టర్ చేస్తోంది. హీరో శివబాలాజి ఇన్వెస్టిగేటర్‌గా నటిస్తున్నాడు. అందాల ఆరబోతకే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రను పోషిస్తున్న ముమైత్ ఖాన్ ఈ చిత్రం విజయంపై పెద్ద ఆశలే పెట్టుకుంది. ఆగస్టులో ఈ రెండు సినిమాలో రీలీజయ్యే అవకాశం ఉంది. ఇలా ఈ ఐటం బాంబ్ వరస ఆఫర్స్ సాధిస్తూ మరింత మజా అందించటానికే ఫిట్ నెస్ కోసం తాపత్రయపడుతున్నానంటోంది. అయితే అభిమానులు మాత్రం ఆమె తగ్గటం ఇష్టం లేక ఎస్.ఎమ్.ఎస్ లు పంపుతున్నారుట. మరి ముమైత్ యే నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











