»   » పవన్ కు చిరుకు విలన్ ఒకడే... అతను ఆ హీరోయిన్ మొగడే

పవన్ కు చిరుకు విలన్ ఒకడే... అతను ఆ హీరోయిన్ మొగడే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ గా తెలుగులో వరస సినిమాలు చేసిన అంజలా జవేరి గుర్తుందా. ఆమె భర్త బాలీవుడ్ నటుడైన తరుణ్ అరోరా. అతను తెలుగులో బిజీ అవటం విశేషం. తరుణ్ అరోరా... తమిళ చిత్రం 'కనిథన్' తో బాగా పాపులరయ్యాడు.

ప్రస్తుతం తరుణ్ అరోరా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం 150' లో కూడా విలన్ గా నటిస్తూ పరిశ్రమలో దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. దాంతో తన అన్న సినిమాలో చేస్తున్న అతన్ని తన సినిమాలోకి తీసుకున్నారు పనవ్ .

Tarun Arora in Pawan's Katama Rayudu?

వివరాల్లోకి వెళితే... పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రం పొలాచ్చిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రాయలసీమ నైపథ్యంలో నడిచే ఈ రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్లో పవన్ కళ్యాణ్ ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు.

అంత శక్తివంతమైన పాత్రలో కనిపించే పవన్ కళ్యాణ్ కు విలన్ గా ఎవరైతే బాగుంటుందని ఆలోచించిన దర్శకుడు డాలి చాలా మందిని పరిశీలించి చివరికి కొత్త నటుడు తరుణ్ అరోరాను ఫైనల్ చేసినట్టు సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

కాటమరాయుడులో ఇతని పాత్రను డాలి చాలా బాగా డిజైన్ చేశాడని, అతనికి పవన్ కళ్యాణ్ కు మధ్య నడిచే సన్నివేశాలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేష్ కూడా ఒక ప్రత్యేకమైన నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు.

తమిళ 'వీరమ్'కు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా శివ బాలాజీ, కమల్ కామరాజ్, అజయ్, చైతన్య కృష్ణలు పవన్ తమ్ముళ్లుగా కనిపించనున్నారు.

English summary
Now, in Pawan's Katama Rayudu movie , Anjala Zaveri's husband Tarun Arora is going to be ropes as a villain.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu