»   » సూపర్ హిట్ దర్శకుడిపై అఖిల్‌ కన్ను? చేస్తానంటూ స్టేజీపై ప్రకటన

సూపర్ హిట్ దర్శకుడిపై అఖిల్‌ కన్ను? చేస్తానంటూ స్టేజీపై ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తొలి చిత్రం అఖిల్ తో డిజాస్టర్ అందుకున్న అఖిల్ తన తదుపరి చిత్రానికి ఏ దర్శకుడు అయితే బాగుంటుందనే విషయమై క్లారిటీకా రాలేకపోతున్నారు. మొన్నామధ్య కృష్ణగాడి వీర ప్రేమ గాధ దర్సకుడు హను రాఘవపూడితో ముందుకు వెళ్తానని ట్విట్టర్ సాక్షిగా ప్రకటించాడు. అయితే అనుకోకుండా సీన్ లోకి నితిన్ వచ్చాడు. హను,నితిన్ కాంబినేషన్ సెట్ అయ్యి మళ్లీ అఖిల్ రెండో చిత్రం దర్శకుడు పోస్ట్ ఖాళీ అయ్యింది.

ఈ నేపధ్యంలో అఖిల్ తన తదుపరి చిత్రం కోసం మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తో ముందుకు వెళ్దామా అనుకున్నారు. ఈ మేరకు ఓ కథ కూడా విన్నారని సమాచారం. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆయనలో మళ్లీ డైలమో మొదలైందిట.

Tarun Bhaskar will be the Director for Akhil's Second Film?

తనకు తగ్గ కథ కాదేమో అని, వేరే యంగ్ డైరక్టర్ తో ముందుకు వెళ్తే ఎలా ఉంటుందని, ఆయన ఆలోచిస్తున్నారుట. అందుకోసం ఆయన మరో దర్సకుడుతో మంతనాలు మొదలెట్టారని సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు..

రీసెంట్ గా చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది 'పెళ్లి చూపులు' చిత్ర దర్శకుడు. 'పెళ్లి చూపులు' సినిమా తెగ నచ్చటంతో దర్శకుడు తరణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అక్కినేని అఖిల్‌ ప్రకటించారు.

హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో జరిగిన 'పెళ్లి చూపులు' విజయోత్సవ సమావేశానికి అఖిల్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 'పెళ్లి చూపులు' కథ, కథనాలు తనను ఎంతో ఆకర్షించాయని వివరించారు. చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యూనిట్‌ సభ్యులు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

English summary
Speculations about Akhil’s next film are propping up. While earlier it was said that Akhil might team up with Hanu Raghavapudi for his next film under their family banner Annapurna Studios, another new director’s name is coming into picture now! He is none other than the Pelli choopulu movie director Tarun Bhaskar!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu