twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సగం రేటుకే ఎన్టీఆర్ మహానాయకుడు టికెట్స్.. మిగిలిన సగం ఖర్చు ఎవరిదో తెలుసా!

    |

    నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపొందించబడింది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైంది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఇలాంటి రెస్పాన్స్ ఎవరూ ఊహించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తెలుగు దేశం పార్టీ వర్గాలని కూడా నిరాశపరిచింది.

    కృష్ణా జిల్లాలో అలా

    కృష్ణా జిల్లాలో అలా

    ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి వసూళ్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఈ చిత్ర పరాజయం తెలుగు దేశం పార్టీ వర్గాలకు కూడా ఇబ్బందిగానే మారింది. కాగా ఈ చిత్రం కోసం కృష్ణ జిల్లాకు చెందిన ఓ టిడిపి నేత చేస్తున్న ప్రచారం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారింది. ఏకంగా చంద్రబాబు ఆదేశం ఆదేశం అంటూ సదరు టిడిపి నేత టిడిపి కార్యకర్తలకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

    సగం రేటుకే టికెట్స్

    సగం రేటుకే టికెట్స్

    ఎన్టీఆర్ మహానాయకుడు చిత్ర టికెట్స్ సగం రేటుకే ఇస్తారని, మిగిలిన సగం ధర పార్టీ భరిస్తుందని ఆ లేఖలో కార్యకర్తలకు తెలిపినట్లు తెలుస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని చూడాలని కోరారట. ఆ లేఖ బయటకు రావడంతో తెలుగు దేశం పార్టీకి మరింత ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. తొలి రోజు నుంచే ఎన్టీఆర్ మహానాయకుడుకి వసూళ్ల విషయంలో షాక్ తగిలింది.

    బాలయ్య నటనని మెచ్చుకున్నా

    బాలయ్య నటనని మెచ్చుకున్నా

    స్వయంగా బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటించారు. బాలయ్య నటనకు మంచి రెస్పాన్స్ వస్తున్నా సినిమాకు మాత్రం ఆదరణ కరువైంది. మరో వైపు రానా ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో నటించాడు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించింది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటినుంచి బసవతారకం మరణించే వరకు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని రూపొందించారు. ఎన్టీఆర్ చివరి రోజులని ఈ చిత్రంలో చూపించలేదు.

    ఆర్జీవీ మరోవైపు

    ఆర్జీవీ మరోవైపు

    వివాదాల జోలికి పోకూడదని ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో లక్ష్మి పార్వతి ప్రస్తావన తీసుకురాలేదు. దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ మధ్య జరిగిన సంఘటనలు, ఎన్టీఆర్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇంకెన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.

    English summary
    TDP leader offer to party activists for NTR Mahanayakudu Tickets
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X