twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యంగ్ హీరో సినిమా TDP ప్రచారం కోసమే?

    By Srikanya
    |

    TDP's Plan with Nara Rohit's 'Pratinidhi'!
    హైదరాబాద్ : ఇది ఎలక్షన్ సీజన్. ఇప్పుడు ప్రతీది బూతద్దంలో చూపబడుతుంది. ఎలక్షన్ నిలబడే పార్టీ సన్నిహితులు చేసే పనులన్నీ ఆ పార్టీ ప్రచార ఏంగిల్ లోనే కనపడతాయి. నారా రోహిత్ తాజా చిత్రం 'ప్రతినిధి' విడుదల అవుతున్న ఈ సందర్భలోనూ అది తమ పార్టీ తెలుగు దేశం ప్రచార చిత్రంగా ఉపయోగపడేందుకే ఈ పొలిటికల్ చిత్రాన్ని దింపుతున్నారంటున్నారు. ఇందులో అన్యాపదేశంగా పార్టీ ప్రచారం, మిగతా పార్టీలపై విసుర్లు ఉంటాయని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పటికే లెజండ్ చిత్రం తెలుగుదేశం తరుపున నిలబడనున్న బాలకృష్ణకు ప్రచార చిత్రంగా ఉపయోగపడుతుందని ఆపమన్న సంగతి తెలిసిందే.

    నారా రోహిత్ మాట్లాడుతూ... ఓటు వేయని ప్రజలకు ప్రశ్నించే అధికారం లేదు. నోటుకు ఓటు అమ్ముకొనే జనానికి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేదు. ముందు ప్రజలు నిజాయతీగా ఉంటే తప్ప పాలనలో, ప్రభుత్వంలో మార్పురాదు. అదే మా 'ప్రతినిధి' ఇచ్చే సందేశం అంటున్నారు నారా రోహిత్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం 'ప్రతినిధి'. శుభ్రా అయ్యప్ప హీరోయిన్. ప్రశాంత్‌ మండవ దర్శకుడు. జె.సాంబశివరావు నిర్మాత. ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''సమకాలీన సమాజ పరిస్థితుల్ని ప్రతిబింబించే చిత్రమిది. ఓ సామన్య పౌరుడు తలచుకొంటే ఏం చేయగలడో చూపిస్తున్నాం. ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. ఆ హక్కుతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. వాటిని గుర్తు తెచ్చే చిత్రమిది. నారా రోహిత్‌ నటన, ఆయన సంభాషణలు ఆకట్టుకొంటాయ''ని చెప్పారు.

    ఈరోజుల్లో రూపాయికే విలువ లేదు. ఇక పైసల్ని పట్టించుకొనేదెవరు? కానీ అతను అలా కాదు. ప్రతి పైసాకీ సమాధానం చెప్పాల్సిందే. ఎనభై నాలుగు పైసల కోసం ఏకంగా.. ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేశాడు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తన కాళ్ల దగ్గరకు రప్పించాడు. ఇంతకీ అతనెవరు? ఆ తరవాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''సమకాలీన సమస్యలపై ఓ సామాన్యుడు సాగించిన సమరం ఇది. ప్రతినిధిగా నారా రోహిత్‌ నటన, ఆయన పలికే సంభాషణలు అందరికీ నచ్చుతాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రచార చిత్రం కూడా ఆకట్టుకొంటోంద''న్నారు. ''ప్రస్తుత రాజకీయాలు సగటు మనిషి జీవితాన్ని ఎలా మారుస్తున్నాయో ఈ చిత్రంద్వారా చూపిస్తున్నాం''అని నిర్మాత చెప్పారు.

    ఇక '18 సంవత్సరాల వయసులో ప్రేమించి పెళ్లిచేసుకుంటే జీవితం పాడైపోతుందని అందరూ అంటారు. అదే 18 సంవత్సరాల వయసులో ఓటేస్తే ప్రభుత్వం పాడైపోతుందని ఎవరూ అడగరే...వస్తున్నా...అడగడానికే వస్తున్నా..' అని నారా రోహిత్ ట్రైలర్స్ లో అంటున్నారు. సమకాలీన రాజకీయాంశాల్ని చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోందని, ప్రజా శ్రేయస్సును కాంక్షించే సిసలైన ప్రజా ప్రతినిధి ఎలా వుండాలో సినిమాలో చూపిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి . సంగీతం: సాయికార్తీక్‌.

    English summary
    Nara Rohith's 'Prathinidhi' movie is schedule for April 25th release. As the main theme of the movie happens to be politics, and questioning the system and politicians, one wonders it is aimed at bringing political mileage to Telugudesam party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X