»   » దర్శకుడు తేజకు రెమ్యునేషన్ కట్ ట్విస్ట్

దర్శకుడు తేజకు రెమ్యునేషన్ కట్ ట్విస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైరక్టర్ తేజ, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి దర్శకుడుగా తేజకి రెమ్యునేషన్ లేదని తెలుస్తోంది. తేజ వరస ప్లాప్ లలో ఉండటం దీనికి ఓ కారణమైతే, లాభాలొస్తే పర్శంటేజ్ ఇస్తానని సురేష్ బాబు పెట్టిన ప్రపోజల్ ఓ కారణమని చెప్పతున్నారు. ఇంతకుముందు శ్రీను వైట్ల..నమో వెంకటేశ చిత్రానికి కూడా అదే జరిగింది. ఆ చిత్రం రెమ్యునేషన్ తీసుకుంటే శ్రీనుకి నాలుగు కోట్లు ఇవ్వాల్సి వచ్చేది. అదే ప్రాఫిట్ లో షేర్ కాబట్టి కోటిన్నరే వచ్చింది. అదే స్కీమ్ ని తేజకి వర్తింపచేయాలనుకుంటున్నారు. ఈ పద్దతి వల్ల దర్శకుడుకి తను చేసే ప్రాజెక్టుపై మరింత శ్రధ్ద పెట్టి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే సురేష్ ప్రొడక్షన్స్ తో నిజమైన రికార్డులు చూపితేనే దర్శకుడు కి డబ్బులు వస్తాయి కాబట్టి..కాస్త ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. అలాగే ఇదే స్కీమ్ సక్సెస్ అయితే పెద్ద బ్యానర్స్ కూడా అనుసరిస్తాయని, తమ రెమ్యునేషన్లపై కోత పడుతుందని పెద్ద దర్శకులు వర్రీ అవుతున్నారు.

Please Wait while comments are loading...