మిరాయ్ మూవీ ఫస్ట్ హీరో ఎవరో తెలుసా? రిజెక్ట్ పాన్ ఇండియా స్టార్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తాజాగా విడుదలైన చిత్రం మిరాయ్. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా నటించిన ఈ సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్ ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 12న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.
మిరాయ్ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ రూ.40 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కు మించిన అవుట్ పుట్ వచ్చిందంటూ సినీ ప్రముఖులు, సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందడం విశేషం. స్క్రీన్ ప్లే, విజువల్ ఎఫెక్ట్స్, బీజీఎం, యాక్షన్, స్టంట్స్ పరంగా ప్రస్తుతం సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

అయితే తేజా సజ్జా మిరాయ్ చిత్రంలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. కానీ తేజా సజ్జా కంటే ముందు మిరాయ్ చిత్రం కథ టాలీవుడ్ ప్రముఖ హీరో దగ్గరకు వెళ్లింది. అయితే స్టార్ హీరో వదులుకోవడంతో యువ హీరో తేజా సజ్జా ఓకే చెప్పి ప్రస్తుతం హిట్ ను అందుకున్నారు. అయితే ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరో, నేచురల్ స్టార్ నానినే అంటూ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
కాగా, నాని ఇప్పటి వరకు తన కెరీర్ లో బెస్ట్ స్క్రిప్ట్ లను వదిలిందే లేదు. నాని సినిమాల్లో ప్రధానంగా విభిన్న కథలు, కథనం ఉంటుందనేది మార్క్ క్రియేట్ చేశారు. అలాంటి నాని ఈ సినిమాను వదులుకున్నారంట. అయితే తనకు ఉన్న కమిట్ మెంట్స్ ద్వారానే ఈ చిత్రాన్ని వదులుకున్నారని, మరోవైపు నాని కూడా మాస్, యాక్షన్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ఇలాంటి కథలను పట్టించుకోలేదనే గాసిప్ వినిపిస్తోంది.
ఏదేమైనా హను-మ్యాన్ చిత్రం తర్వాత తేజా సజ్జాకు మిరాయ్ మరో మైల్ స్టోన్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం 3 రోజుల్లో రూ.70 కోట్ల గ్రాస్ ను వసూల్ చేయడం విశేషం. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించారు. శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. మరోవైపు నేచురల్ స్టార్ నాని చివరిగా హిట్ 3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక నెక్ట్స్ ప్యారడైజ్ చిత్రంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తన్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











