»   » తెలంగాణా ఎఫెక్ట్ : 'ఎవడు' రిలీజ్ వాయిదా??

తెలంగాణా ఎఫెక్ట్ : 'ఎవడు' రిలీజ్ వాయిదా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్‌, అమీ జాక్సన్‌ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 31న విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆగస్టు 15 కి మారే అవకాసం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణా ప్రకటన వచ్చే అవకాసం ఉందని, ఈ నేపద్యంలో రాష్ట్రం కొన్ని చోట్ల బంద్ లు వంటివి చోటు చేసుకుని కలెక్షన్స్ పై ఇంపాక్ట్ పడే అవకాసం ఉందని వాయిదా వేస్తారని చెప్తున్నారు. అయితే దర్శక,నిర్మాతల వైపు నుంచి ఈ విషయమై ఏ విధమైన ప్రకటన రాలేదు.

దిల్‌ రాజు మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. చరణ్‌ నటన, నృత్యాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, కాజల్‌ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు''అన్నారు. ఎవడు' మూవీ విడుదలకు వారం రోజుల గ్యాప్‌తో పవర్ స్టార్ నటించిన 'అత్తారింటికి దారేది' మూవీ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఎఫెక్టు పడుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...అత్తారింటికి దారేది సినిమా వల్ల ఎవడు సినిమాకు ఎలాంటి సమస్య రాదని భావిస్తున్నాం. ఇప్పటికే అనేక కమర్షియల్ హిట్స్ ఇచ్చిన రామ్ చరణ్ ఎవడు చిత్రంతో మరో విజయం సొంతం చేసుకుంటారు' అనే నమ్మకం వ్యక్తం చేసారు.

చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు. మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఈచిత్రానికి సెన్సార్ బోర్డ్ సభ్యులు 'A' సర్టిఫికెట్ జారీ చేసారు. పెద్దలు మాత్రమే చూడదగిన సినిమాకు మాత్రమే 'A' సర్టిఫికెట్ జారీ చేస్తారు. దీన్ని బట్టి సినిమాలో వయోలెన్స్, రొమాన్స్ పాళ్లు ఎక్కువగానే ఉన్నాయని స్పష్టం అవుతోంది. కోట శ్రీనివాసరావు, జయసుధ, సాయికుమార్‌, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్‌.బి.శ్రీరాం, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌, కూర్పు: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

English summary
The much-awaited action thriller "Evadu", starring Ramcharan Tej and Shruti Haasan, is set to be the first casualty of the political turmoil following the Congress high command's decision to bifurcate the state.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu