»   » నాగార్జున ప్లాన్: క్రికెటర్ సచిన్‌ జీవితంపై తెలుగు సినిమా?

నాగార్జున ప్లాన్: క్రికెటర్ సచిన్‌ జీవితంపై తెలుగు సినిమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా సచిన్ జపమే. సచిన్ క్రికెట్ కెరీర్ క్లైమాక్స్‌కు చేరుకోవడమే ఇందుకు కారణం. రేపు ప్రారంభం అయ్యే 200వ టెస్టు తర్వాత సచిన్ పూర్తిగా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరం కాబోతున్నాడు. సచిన్ చివరి మ్యాచ్ చూసేందుకుగాను టిక్కెట్లు దక్కించుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానులు పోటీ పడుతున్నారు.

సందెట్లో సడేమియాలా....సచిన్ గురించి టాలీవుడ్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సచిన్ జీవితంపై ఓ తెలుగు సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నాగార్జున తనయుడు అఖిల్ నటించనున్నట్లు చర్చించుకుంటున్నారు. అఖిల్ మొదటి సినిమా కానీ, రెండో సినిమాగా కానీ ఇది ఉంటుందని టాక్.

సచిన్ జీవితంపై సినిమా అంటే దేశం మొత్తం ఆసక్తి ఉంటుంది. అఖిల్ స్వతహాగా మంచి క్రికెట్ ఆటగాడు అని ఇప్పటికే సిసిఎల్ కప్‌లో రుజువైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగులో తీసి దేశంలోని కొన్ని ముఖ్యమైన బాషల్లో రిలీజ్ చేసి....తన వారసుడిని జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట నాగార్జున. మరి ఈ వార్తల్లో నిజమెంతో త్వరలోనే క్లారిటీ రానుంది.

ఆ విషయం పక్కన పెడితే...సచిన్ అభిమానుల్లో ఒకరైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ నెల 14 నుంచి 18 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ ఆడే చివరి టెస్ట్ మ్యాచ్‌ చూసేందుకు ఫ్యామిలీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తన తాజా సినిమా '1-నేనొక్కడినే' షూటింగులో భాగంగా గోవాలో ఉన్నారు. అటు నుండి నేరుగా ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

English summary
Film Nagar buzz is that Master blaster Sachin Tendulkar life story is being taken as a premise to make a Telugu film. The interesting part is, Akhil Akkineni might be making his presence with this subject.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu