»   »  మెగా హీరో పట్టుబట్టి మరీ తమన్ కి మళ్లీ మేకప్ వేసి

మెగా హీరో పట్టుబట్టి మరీ తమన్ కి మళ్లీ మేకప్ వేసి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ మ్యూజిక్ డైరక్టర్ తమన్‌లో ఓ మంచి నటుడున్నాడని, అతని తొలి ఇండస్ట్రి పరిచయమే నటుడుగా జరిగిందని తెలిసిందే. అప్పట్లో ప్రముఖ తమిళ దర్శకుడు డైరక్షన్ లో వచ్చిన 'బోయ్స్‌'లో తమన్‌ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు మళ్లీ తమన్‌ ముఖానికి మేకప్ వేసుకొంటున్నాడు.

పూర్తి వివరాల్లోకికి వెళితే..సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'తిక్క'. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు అతిథి పాత్రలో తళుక్కున కనిపించబోతున్నారని సమాచారం. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. త్వరలోనే తమన్‌పై సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ పట్టుబట్టి మరీ తమన్ చేత పాత్ర చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

తిక్క కధాంశమేమిటీ అంటే...ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్‌ అవ్వడంతో హీరో ఆదిత్యకు తిక్క వస్తుంది. తమ ప్రేమను మరల ఎలా తిరిగి సాధిస్తాడు అనే అంశంతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అల్లరిగా తిరిగే హీరో ఆదిత్య అమ్మాయి వల్ల ఎలాంటి మార్పు వస్తుంది అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. ఎవరి జీవితంలో వారే హీరో, నా జీవితంలో మాత్రం నేనే విలన్‌ అనే డైలాగ్‌ ఈ సినిమాకు కీలకం కానున్నదని చెప్తున్నారు.

Thaman Cameo In Sai Dharam Tej's Thikka

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలయ్యింది. మంచి రెస్పాన్స్‌ వస్తోంది ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ చాలా హ్యాండ్సమ్‌గా కనిపించనున్నాడని చెప్తున్నారు. అలాగే అతని పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతోందట. దర్శకుడు, హీరో సాయిధరమ్‌ కోసం డిఫరెంట్‌ మేనరిజమ్స్‌తో కూడిన క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశానంటున్నాడు.

సాయి ధరమ్ తేజ మంచి ఎనర్జీతో 'తిక్క' చూపించనున్నాడని దర్శకుడు చెప్పాడు. లారిస్సా బొనేసి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతోందిట ఈ సినిమాలో. తమన్‌ అందించిన మ్యూజిక్‌ ఈ సినిమాకు ప్లస్‌ కానుంది.

దర్శకుడు సునీల్‌ రెడ్డి మాట్లాడుతూ... ఈ చిత్రం నాకు రెండవది. ఈ చిత్రం కామెడి ఎంటర్‌టైనర్‌ . ఈ చిత్రంలో సాయి ధరమ్‌ తేజకు ఒక హీరోయిన్‌ మాత్రమే ఉంటుంది. ఐదుగురు హీరోయిన్స్‌ అని అనుకుంటున్నారు కాదు అన్నారు.

English summary
Rocking composer SS Thaman will be seen in a cameo role in Sai Dharam's Tej's upcoming film Thikka.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu