twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎక్సక్లూజివ్ :తమిళ హిట్ రీమేక్ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్

    By Srikanya
    |

    హైదరాబాద్ : తమిళంలో హిట్టైన సినిమాలను తెలుగులో రీమేక్ రైట్స్ తీసుకుని చేయటం అనాదిగా జరుగుతున్న విషయమే. తాజాగా వారం క్రిందట విడుదలై సూపర్ టాక్ తో దూసుకుపోతున్న 'Thani Oruvan' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ తో చేయటానికి రంగం సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తమిళంలో డైరక్ట్ చేసిన డైరక్టర్ రాజానే తెలుగులోనూ డైరక్ట్ చేయనున్నారు. నిర్మాత ఎన్.వి ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇక రామ్ చరణ్ తాజా చిత్రం బ్రూస్ లీ విషయానికి వస్తే...

    ఈ సినిమాలో రామ్ చరణ్ తన చేతిపై బ్రూస్ లీ టాటూతో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి తరహా పాత్ర అని రచయిత గోపీ మోహన్ చెప్తున్నారు.

    "వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.

    'Thani Oruvan' to be Remade Telugu with Ram Charan

    విడుదలైన మూడు రోజుల్లోనే 1 మిలియన్ (10 లక్షల) వ్యూస్ సాధించి చెర్రీ సినిమా టీజర్ యూట్యూబ్‌లో ముందుకు వెల్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. అక్టోబర్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్నారు.

    ఇందులో చిరంజీవి ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నారు. సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది. చరణ్‌ ఫైట్‌ మాస్టర్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరు ఓ 'స్టార్‌' పాత్రలో కనిపించబోతున్నారని, ఆయన నటించే చిత్రానికి చరణ్‌ ఫైట్‌ మాస్టర్‌గా పనిచేసే సన్నివేశం ఒకటుందని తెలుస్తోంది. చిరు కనిపించేది కొద్దిసేపే అయినా ఈ కథకు ఆ సన్నివేశం కీలకం కానుందట.

    ఇది వరకు 'మగధీర'లో చిరంజీవి, రామ్‌చరణ్‌లు కలసి సందడి చేశారు. ఆ తరవాత తెరపై ఇద్దరూ కలిసి కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు చిరు, చరణ్‌ను ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు దక్కుతోందని వారు ఆనందపడిపోతున్నారు.

    రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి స్క్రిప్టు అందిస్తూండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

    దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.

    ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Thani Oruvan (TO) directed by Mohan Raja starring Jayam Ravi and Nayanthara in the lead, released last Friday and is creating huge ripples at the box office. The thriller, which is about the conflict between good and evil, was well-received for the interesting dimension and vision brought out by Raja as well as actors Ravi, Arvind Swami and Nayanthara. Now, the big news is that many Bollywood and Tollywood producers are vying for the film’s remake rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X