»   » ధూమ్-3 నిర్మాతను పెళ్లాడబోతున్న హీరోయిన్?

ధూమ్-3 నిర్మాతను పెళ్లాడబోతున్న హీరోయిన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ధూమ్-3 చిత్ర నిర్మాత, యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా....హీరోయిన్ రాణీ ముఖర్జీ మధ్య ఎఫైర్ ఉన్నట్లు గత కొంత కాలంగా బాలీవుడ్లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వీరు ఫిబ్రవరి 10, 2014లో జోధ్‌పూర్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరు ఇపుడు కలిసే ఉంటున్నారని, ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కూడా వీరి సంబంధంపై సంతృప్తిగానే ఉంటున్నారని టాక్. ఇద్దరూ పెళ్లి విషయంలో ఓ అంగీకారానికి వచ్చారని, ఫిబ్రవరి 10, 2014న జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్‌లో వీరి వివాహ వేడుక గ్రాండ్‌గా జరుగనున్నట్లు తెలుస్తోంది.

Rani Mukherjee-Aditya Chopra

ఈ సంవత్సరం జులై నెలలోనే వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. రాణి ముఖర్జీ చేతికి ఖరీదైన డైమండ్ రింగ్ కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలమయ్యాయి. అయితే ఇప్పటి వరకు మాత్రం ఈ విషయం అధికారికంగా వెల్లడికాలేదు. తాజాగా పెళ్లి విషయంలోనూ ఇదే తరహా గోప్యంత కొనసాగుతుండటం గమనార్హం. వాస్తవానికి వీరి పెళ్లి ఇప్పటికే జరుగాల్సి ఉండగా....యశ్ చోప్రా మరణంతో వాయిదా పడిందని అంటున్నారు.

రాణి ముఖర్జీ యష్ రాజ్ ఫ్యామిలీ క్లోజ్ ఉంటూ వస్తోంది. వారింట్లో ఏ కార్యక్రమం జరిగినా...ఏలాంటి సెలబ్రేషన్స్ జరిగినా రాణి తప్పకుండా హాజరవుతుంది. ఆ మధ్య ఆదిత్య చోప్రా తండ్రి యష్ చోప్రా ఆసుపత్రిలో చేరినప్పటి నుండే ఆమె తన ఈవెంట్స్ అన్నీ కాన్సిల్ చేసుకుని దగ్గరుండి చూసుకుందట. ఆయన మరణించిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆయన కుటుంబంతోనే గడిపింది.

English summary
After years of speculation, gossip mongers can finally relax! Rani Mukherjee and the Yash Raj scion, Aditya Chopra are likely to tie the knot on February 10, 2014 in Jodhpur.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu