»   » విజయ్ దేవరకొండ అందుకే హ్యాండిచ్చాడట.. షాకింగ్ ట్వీట్..

విజయ్ దేవరకొండ అందుకే హ్యాండిచ్చాడట.. షాకింగ్ ట్వీట్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అర్జున్‌రెడ్డి సినిమా తర్వాత హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ దక్షిణాదిలో భారీగానే పెరిగిపోయింది. ఆ చిత్రం తర్వాత విడుదలవుతున్న విజయ్ దేవరకొండ సినిమా ఏ మంత్రం వేశావే. తన చిత్రం విడుదల నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఎక్కడ ప్రమోషన్‌లో పాల్గొనడం గానీ, సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్టు గానీ కనిపించలేదు. కానీ ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్‌ను ట్విట్టర్‌లో ట్వీట్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

2013లోనే షూటింగ్

2013లోనే షూటింగ్

ఏ మంత్రం వేసావే చిత్ర విడుదల నేపథ్యంలో విజయ్ దేవరకొండ గురించి ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఏ మంత్రం వేసావే చిత్రం 2013లో ప్రారంభమైంది. సగం పూర్తయిన తర్వాత డేవిడ్ ఫిచర్ రూపొందించిన హాలీవుడ్‌ చిత్రం ది గేమ్ అని గుర్తించాడట. అయితే అప్పుడప్పుడే నటుడిగా గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని పూర్తి చేశాడు.

వర్కవుట్ కాదని ఆపారట

వర్కవుట్ కాదని ఆపారట

ఏ మంత్రం వేసావే చిత్రం ముందు విజయ్‌కి పెద్దగా క్రేజ్ లేదు. ఆ సినిమాతో హీరోగా గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో 2013లోనే సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలను కోరాడు. కానీ ఆ సమయంలో విడుదల చేస్తే కమర్షియల్‌గా వర్కవుట్ కాదు అని నిర్మాతలు భావించారు అని కథనంలో పేర్కొన్నారు.

అర్జున్‌రెడ్డి సినిమా తర్వాత

అర్జున్‌రెడ్డి సినిమా తర్వాత

ఇక అర్జున్‌రెడ్డి రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస చిత్రాలతో బిజీ అయిపోయాడు. పలు భాషల్లో నటించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో ఏ మంత్రం వేసావే రిలీజ్ చేస్తే బాగుంటుంది అని నిర్మాతలు భావించారు.

ప్రమోషన్‌కు దూరం

ఏ మంత్రం వేసావే చిత్రం రిలీజ్ నేపథ్యంలో సినిమాను ప్రమోట్ చేస్తారని అంతా భావించారు. కానీ విజయ్ దేవరకొండ తన షూటింగ్‌లో బిజీ అయిపోయారు. కానీ ఏ మంత్రం వేసావే చిత్రం తనకు బ్యాక్‌లాగ్ లాంటింది అని సినిమా గురించి విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. కానీ విజయ్ ట్వీట్ చేసింది మాత్రం ఐదేళ్ల క్రితం నటించిన ఓ య్యూటూబ్ గురించి అని స్పష్టమవుతున్నది.

పొలిటీషియన్‌గా నోటాలో

పొలిటీషియన్‌గా నోటాలో

ప్రస్తుతం విజయ్ దేవరకొండ తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న నోటా అనే చిత్రంల నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన మెహరీన్ పిర్జాదా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ రాజకీయవేత్తగా నటిస్తున్నట్టు రూమర్లు షికారు చేస్తున్నాయి.

English summary
Actor Vijay Devarakonda's Ye Mantram Vesave is also in screens after five years. The actor recently took to Twitter and called Ye Mantram Vesave a backlog in his career. Vijay carefully stayed away from promoting this venture, which has been receiving terrible reviews from the audiences and critics alike. A English daily report said, "Halfway through the film in 2013, Vijay realised that it was a rip-off of David Fincher's 1997 blockbuster, The Game. He was shocked, but continued shooting for it as he was a struggling actor back then."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu