ఈసారి అల్లు అర్జున్ కి ముగ్గురు హీరోయిన్స్

ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ ఫైనల్ చేసి మిగతా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పడ్డారు. ఈ చిత్రంపై అభిమానులు భారీగానే అంచనాలు పెంచుకొంటున్నారు. ఇక ప్రస్తుతం సంగీత చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కబోతోంది. ఇందులో అల్లు అరవింద్ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్. కథ ఇప్పటికే సిద్ధమైందట.
మరో ప్రక్క అల్లుఅర్జున్ 'రేసుగుర్రం' తుదిదశకు చేరుకొంది. 'రేసు గుర్రం' చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నాడు. ఫన్,యాక్షన్ కలిపి మరో కిక్ లా రూపొందిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











