»   » అసలే అఖిల్ మండిపడుతూంటే, ఇంకో రూమర్ మొదలైంది

అసలే అఖిల్ మండిపడుతూంటే, ఇంకో రూమర్ మొదలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నట వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన అఖిల్ తన తొలి చిత్రం డిజాస్టర్ కావటంతో ప్రస్తుతం తన రెండో సినిమా కథ, కథనాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అఖిల్ స్టార్ కిడ్ కావంటతో ఆయన రెండో సినిమాపై రూమర్స్, న్యూస్ లు రావటం కామన్. అయితే ఆ రూమర్స్ ని అడ్డం పెట్టుకుని ఆయన కూడా మీడియాకి పదే పదే క్లాసులు పీకే కార్యక్రమం ట్విట్టర్ ద్వారా పెట్టుకున్నారు.

అయితే రూమర్స్ ఆగుతాయా... ఫామ్ లో ఉన్న హీరోపై వార్తలు రాకపోతే ఎలా...అందుకేనేమో అఖిల్ ..నాపై రూమర్స్ వద్దు బాబోయ్ అని మొత్తుకుంటున్నా..ఇంకో రూమర్ లాంటి వార్త మీడియా సర్కిల్స్ లో ప్రచారం మొదలైంది. మరి దీన్ని కూడా అఖిల్ ఖండిస్తారో లేదో తెలియదు కానీ ఆ రూమర్ ఏంటో మీరు తెలుసుకోండి మరి.

అక్కినేని అఖిల్ రెండవ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా కొనసాగుతోంది. 'ఊపిరి' ఘన విజయంతో ఎంతో సంతోషంగా ఉన్న నాగార్జున ఈ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లిపై పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. అందుకే అఖిల్ రెండవ చిత్రానికి దర్శకత్వపు బాధ్యతలను వంశీకి అందించాడు. అంతవరకూ ఓకే.

Title For Akhil's New Movie Fixed?

ఈ దర్శకుడు కొత్త సినిమా స్క్రిప్టును ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రానికి ఇదివరకే ఓ టైటిల్‌ను ఫిల్మ్‌మేకర్స్ ఖరారు చేశారని తెలిసింది. ఈ చిత్రానికి 'లైలా ఓ లైలా' అనే టైటిల్ పెట్టారట. ఈ టైటిల్‌తోనే సినిమా ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరానున్నాయి.

రెండు రోజుల క్రితం..అఖిల్ తన రెండో సినిమాపై వస్తున్న పుకార్లకు తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచాడు. వంశీతో, తనకు మంచి రిలేషన్ ఉందని, ప్రస్తుతం కథకు సంబంథించిన చర్చలు జరుగుతున్నాయని తెలిపాడు . తన రెండో సినిమా గురించి ఇంకా ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ చేయలేదన్నారు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని అప్పటి వరకు అసత్యాలు రాయోద్దని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు అఖిల్.

Title For Akhil's New Movie Fixed?

గత ఏడాది 'అఖిల్' చిత్రంతో హీరోగా పరిచయమైన అఖిల్‌ను ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. ఈ ఫెయిల్యూర్ నుంచి బయటపడి తన రెండవ సినిమాకు సిద్ధమవుతున్నాడు ఈ యంగ్ హీరో . అఖిల్ తొలి చిత్రం రూ. 47 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయగా... ఈ సినిమా కనీసం 20 కోట్లను కూడా సంపాదించలేకపోయింది.

దీంతో రెండో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి హీరోగా దూసుకుపోవాలని అనుకుంటున్నాడు అఖిల్. నిజమవ్వాలని కోరుకుందాం. అప్పటివరకూ రూమర్స్ ని ఖండించటంలో బిజీ కాకుండా సినిమాపై పూర్తి దృష్టి పెట్టాలని ఆశిద్దాం. రూమర్స్ ఎప్పుడు ఆగుతాయంటే ఎప్పుడయితే పూర్తి క్రేజ్ తగ్గిపోతుందో అప్పుడు అనే విషయం తెలుసుకుంటే బాగుంటుంది.

English summary
The title for Akhil's next has been finalised. Talk has it that the movie would be christened as 'Laila O Laila'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu