»   » ఇదే హాట్ టాపిక్ ఇప్పుడు :'వీడు అదో టైపు....వాడు మరో టైపు'

ఇదే హాట్ టాపిక్ ఇప్పుడు :'వీడు అదో టైపు....వాడు మరో టైపు'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మంచు విష్ణు, రాజ్‌ తరుణ్‌ హీరోలుగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సోనారిక, హెబ్బాపటేల్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం క్యారీ ఆన్ జట్టా అనే పంజాబ్ సూపర్ హిట్ చిత్రం రీమేక్. ఇక ఈ చిత్రానికి రీసెంట్ గా టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం.

Photos: Manchu Vishnu, Raj Tarun Movie Launch

ఆ టైటిల్ మరేదో కాదు..'వీడు అదో టైపు....వాడు మరో టైపు' . పూర్తి స్థాయిలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ చెబుతోంది. మంచు విష్ణు, రాజ్ తరుణ్‌ల కాంబినేషన్ కచ్చితంగా హిట్ అవుతుందని వారు భావిస్తున్నారు.

Title For Vishnu - Raj Tharun Film

నిర్మాత మాట్లాడుతూ ...ఆద్యంతం వినోదాలు పంచే చిత్రమిది. విష్ణు, రాజ్‌తరుణ్‌ పాత్రలు రెండూ దేనికదే వైవిధ్యంగా ఉంటాయి. ఏప్రిల్‌ 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు.

రాజేంద్రప్రసాద్‌, పోసాని, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, సుప్రీత్‌, శత్రు, ధనరాజ్‌, ఫిష్‌ వెంకట్‌, సత్యకృష్ణ, హేమ, గీతాసింగ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: నరేష్‌ కథూరియా, స్మీప్‌ కాంగ్‌, మాటలు: డైమంట్‌ రత్నబాబు, సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ రామస్వామి, ఎడిటర్‌: ఎమ్‌.ఆర్‌ వర్మ, ఆర్ట్‌: నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గరికపాటి కిషోర్‌, మేకప్‌: రంగా, కాస్టూమ్స్‌: శివ-ఖాదర్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రాంబాబు, ఛీఫ్‌ కో డైరెక్టర్‌: గోపి.

English summary
‘Veedu Ado Type – Vaadu Maro Type’ is the title which is under consideration for Vishnu – Raj Tarun multistarrer film. An official announcement will be made soon or later.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu