»   » హీరోయిన్ ఇలియానా కండోమ్ గురించి..?

హీరోయిన్ ఇలియానా కండోమ్ గురించి..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల్లో హాట్ అండ్ సెక్సీ పడకగది సీన్లు చేయడానికి కొందరు హీరో హీరోయిన్లు ఇబ్బంది పడుతుంటారు. కొందరు మాత్రం అలాంటి సీన్లు ఎలాంటి మొహమాటం లేకుండా చేసేస్తుంటారు. అదే విధంగా యాడ్ ఫిల్మ్ ప్రపంచంలో చాలా మంది హీరో హీరోయిన్లు వివిధ రకాల యాడ్లలో నటిస్తున్నా.... కండోమ్ యాడ్లలో నటించాలంటే మాత్రం ఇబ్బంది పడతారు. కొందరు మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా కండోమ్ యాడ్స్ చేయడానికి ఓకే చెబుతారు.

తాజాగా... ప్రముఖ హీరోయిన్ ఇలియానా కండోమ్ యాడ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ యాడ్ చేయాల్సిందిగా హీరోయిన్ కాజల్ కు అవకాశం వచ్చిందని, కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని సదరు కండోమ్ కంపెనీ ఆఫర్ చేసినా కాజల్ నో చెప్పినట్లు సమాచారం.

తాజాగా ఈ కండోమ్ యాడ్లో చేయడానికి ఇలియానా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాడ్ బయటకు వస్తే తప్ప ఏ విషయం అనేది క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మరి కండోమ్ యాడ్లో ఇలియానా తన అందాల ఆరబోత ఏ రేంజిలో చేస్తుందో చూడాలి.

Tollywood actress in a hot condom ad!

సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడే ఇలియానాకు ఈ యాడ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మధ్య ఇలియానా సెక్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా మరోసారి సెక్స్ గురించి హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనాలిటీ, రిలేషన్ షిప్స్‌పై తన అభిప్రాయం, లవ్ అండ్ సెక్స్ గురించి వెల్లడించింది.

ప్రియుడితో నువ్వు కావాలనుకునే డేట్ ఎలా ఉండాలి అనే ప్రశ్నకు ఇలియానా స్పందన ఆసక్తికరంగా ఉంది. ‘బీచ్ ఒడ్డున ఒక పిక్నిక్ బాస్కెట్, ఒక బ్లాంకెట్. పక్కనే వెచ్చదనం కోసం బోన్ ఫైర్. నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటూ...అద్భుతమైన ఫుడ్, వైన్ తీసుకుని తీయటి కబుర్లు చెప్పుకోవాలి. ఈ క్రమంలో రసరమ్యమైన సెక్స్ పొందాలి' అంటూ ఇలియానా సమాధానం ఇచ్చింది.

‘ఒక మనిషిని నువ్వు నిజంగా ప్రేమిస్తే...అతను కూడా నిన్ను అంతగానే ప్రేమించే వాడు అయితే ఆ అమ్మాయి లక్కీ గర్ల్ అవుతుంది. ప్రేమికుల మధ్య సెక్స్ జరుగడం సాధారణమే. కానీ సెక్స్ జరిగినంత మాత్రాన వారి మధ్య నిజమైన ప్రేమ ఉన్నట్లు కాదు' అంటోది ఇలియానా.

English summary
Bollywood source said that, One of the top actresses in Tollywood and Bollywood Ileana D’Cruz, who is a super hot figure, is all set to feature in a commercial ad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu