»   » అఖిల్ పెళ్లి ముహుర్తానికే చైతూ, సమంత పెళ్లి?

అఖిల్ పెళ్లి ముహుర్తానికే చైతూ, సమంత పెళ్లి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని అఖిల్‌, శ్రీయభూపాల్‌ల పెళ్లి క్యాన్సిల్‌ అయిందనే వార్త కన్ఫర్మ్ అని బలంగా వినిపిస్తున్నది. మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా అటు అక్కినేని ఫ్యామిలీ గానీ, జీవికే కుటుంబం గానీ పెదవి విప్పకపోవడం మరింత ఆసక్తిని కలుగుజేస్తున్నది.

చైతూ, సమంతపై పెరుగుతున్న ఒత్తిడి

చైతూ, సమంతపై పెరుగుతున్న ఒత్తిడి

ఓ వైపు అఖిల్‌ పెళ్లి రద్దయిందంటూ వస్తున్నవార్తల నేపథ్యంలో నాగచైతన్య, సమంతలపై ఒత్తిడి పెరుగుతున్నట్టు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. అఖిల్‌ పెళ్లి మే నెలలో పూర్తి చేసి ఆ తర్వాత ఈ ఏడాది చివర్లో చైతూ-సమంతల మ్యారేజికి డేట్ ఫిక్స్ చేయాలని నాగార్జున భావించారు. పరిస్థితులు మరో విధంగా దారితీయడంతో చైతూ పెళ్లి వేడుక ముందుకు జరిగినట్టు తెలుస్తున్నది.

చైతూ, సమంత పెళ్లి ముందే జరుగొచ్చు

చైతూ, సమంత పెళ్లి ముందే జరుగొచ్చు

అఖిల్‌ పెళ్లి దాదాపు రద్దవడంతో చైతూ-సమంతల పెళ్లి అనుకున్న సమయం కంటే ముందే జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే అఖిల్‌ కోసం అనుకున్న ముహూర్తానికే చైతూ, సమంతల పెళ్లి చేసెయ్యాలని నాగ్‌ భావిస్తున్నాడట.

పెళ్లి పీటల ఎక్కడానికి చైతూ సిద్ధం

పెళ్లి పీటల ఎక్కడానికి చైతూ సిద్ధం

తమ పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందనే కారణంతో చైతూ, సమంత ఇద్దరూ చెరో రెండు సినిమాలూ అంగీకరించారు. ఒకవేళ నాగార్జున కోరుకుంటే మాత్రం ముందుగానే పెళ్లి పీటలు ఎక్కడానికి చైతూ, సమంత సిద్ధంగానే ఉన్నారనే టాక్‌ వినిపిస్తున్నది.

అపాయింట్‌మెంట్స్ క్యాన్సిల్.. ఇంటికే పరిమితం

అపాయింట్‌మెంట్స్ క్యాన్సిల్.. ఇంటికే పరిమితం

ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో నాగార్జున డిప్రెషన్‌కు గురైనట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముందుగా చేసుకొన్న అపాయింట్‌మెంట్స్ కూడా నాగ్ రద్దు చేసుకొన్నట్టు సమాచారం. బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితమై కొద్దిమంది సహచరులను మాత్రమే కలుస్తున్నట్టు తెలుస్తున్నది.

English summary
Tollywood's much-awaited wedding of actor Akhil Akkineni and Shriya Bhupal getting called off has been making rounds. In this situation, there rumour that Naga Chaitanya, Samantha Marriage date prephoned.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu