షాకింగ్ : టాలీవుడ్ స్టార్ కపుల్ మధ్య విభేదాలు.. టెన్షన్ లో ఫాన్స్, అసలేం జరుగుతోంది?

ఒకరకంగా ప్రేక్షకులకు సినీ తారలు అంటే చాలా అభిమానం. మరీ ముఖ్యంగా తమ అభిమాన హీరో హీరోయిన్ల గురించి అనేక విషయాలు తెలుసుకోవాలని అభిమానులు తహతహలాడుతుంటారు. సినిమా హీరో హీరోయిన్లు, నటీనటుల గురించి ఎలాంటి విషయం బయటకు వచ్చినా అది హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాల మీద కూడా ఇటు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ లో స్టార్ కపుల్ విడాకుల బాటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా వారి మధ్య సఖ్యత లేదని ఈ పరిణామాలు ఎంత వరకు వెళ్తాయో టెన్షన్ లో ఫ్యాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

కామన్ గా

కామన్ గా

సినిమారంగంలో ప్రేమ వివాహాలు ఆ తర్వాత విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఈ కల్చర్ ఒకప్పుడు బాలీవుడ్లో విపరీతంగా ఉండేది ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం ఆ కొన్నాళ్లకే మళ్ళీ విడిపోవడం అనేది. ఈ మధ్య కాలంలో కూడా స్టార్ కపుల్ అమీర్ ఖాన్ కిరణ్ రావులు విడాకులు తీసుకున్నారు. అయితే టాలీవుడ్ లో మాత్రం ఈ ట్రెండ్ అంతగా లేదు. ప్రేమించి వివాహం చేసుకున్న వారు తర్వాత విడిపోయిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి.

స్టార్ కపుల్ మధ్య విభేదాలు

స్టార్ కపుల్ మధ్య విభేదాలు

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఒక స్టార్ కపుల్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి అనే ప్రచారం జరుగుతోంది. ఈ టాలీవుడ్ క్రేజీ కపుల్ కి చాలా ఫాలోయింగ్ ఉంది. వీరి వివాహం జరిగినప్పుడు కూడా నేషనల్ మీడియా దృష్టి పెట్టింది. అయితే పెళ్లి అయిన నాటి నుంచి అన్యోన్యంగా ఉండే ఉంటున్న ఈ జంట మధ్య ఇప్పుడు మనస్పర్థలు ఏర్పడ్డాయి అనే ప్రచారం అయితే జోరందుకుంది. ప్రస్తుతానికి ఒక దగ్గర కలిసి ఉంటున్నా సరే వీరి మధ్య మాత్రం మనస్పర్థలు తారాస్థాయికి చేరాయి అని ప్రచారం జరుగుతోంది.

కన్ఫ్యూజన్ లో

కన్ఫ్యూజన్ లో

నిజానికి ఈ జంట ఫ్యాన్స్ ఇప్పుడు ఒక రకమైన కన్ఫ్యూజన్ లో పడ్డారు. దానికి కారణం వీరిద్దరూ కలిసి హైదరాబాద్ కాకుండా వేరే చోట్ల ప్రాపర్టీ లు కొని అక్కడ కూడా తమకు ఇష్టమైన రీతిలో భవనాలు నిర్మించుకోవాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరోపక్క వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని త్వరలోనే విడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వీటిలో ఏ వార్తలు నమ్మాలి ? అసలు తమ అభిమాన జంట మధ్య నిజంగా మనస్పర్ధలు వచ్చాయా ? వారిద్దరూ నిజంగా ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? అనే విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

సోషల్ మీడియాలో ఆ పనితో

సోషల్ మీడియాలో ఆ పనితో

అయితే ఇటీవలే సదరు నటిమణి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పని కూడా ఈ అనుమానాలు రేకెత్త డానికి ఒక కారణం అని చెప్పవచ్చు. దానిమీద మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా ఆమె దానిని దాటవేసే ప్రయత్నం చేశారు కానీ దానికి సంబంధించిన క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. అలాగే కొన్ని నివేదికల ప్రకారం సదరు హీరో కూడా సినిమాకి సంబంధించిన విషయాలు బయట వారితో మాట్లాడుతున్నారు కానీ ఎవరైనా ఫ్యామిలీ గురించి ప్రశ్నిస్తే వారిని పక్కన పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
ఎంతవరకు వెళ్లబోతోంది

ఎంతవరకు వెళ్లబోతోంది

అయితే సాధారణంగా నటీనటుల పర్సనల్ లైఫ్ మీద అందరికీ ఆసక్తి ఉండటం సహజమే. వారి మధ్య ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా ఇలా కథనాలు బయటకు రావడంతో ఫ్యాన్స్ మాత్రం ఆ టెన్షన్ ని అనుభవిస్తున్నారు. భార్య భర్తలు అన్నాక చిన్నాచితకా గొడవలు రావడం అనేది సహజం. అంత మాత్రానికి ఇలా భావించడం సరికాదని ఫ్యాన్స్ వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏమిటో అనే దానిమీద అయితే సరైన క్లారిటీ లభించడం లేదు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్లబోతోంది అనే విషయం మీద వేచి చూడాల్సిన పరిస్థితి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X