మిరాయ్ పార్ట్ 2లో స్టార్ హీరో.. ఎవరో చెప్పిన టీమ్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ మిరాయ్. సూపర్ యోధా యాక్షన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మిరాయ్ చిత్రం సెప్టెంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, జపనీస్న భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకు అన్ని భాషల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతుండటం విశేషం. ఓపెనింగ్ రోజే సినిమాకు వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ దక్కింది. ఇక అదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కూడా అందుకుంటోంది.

ఇప్పటికే తేజా సజ్జా సూపర్ హీరో ఫిల్మ్ హను-మ్యాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్ల వరకు వసూళ్లను సాధించి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మిరాయ్ చిత్రం కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంది. మిరాయ్ చిత్రం కథ, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, స్టంట్స్, నటీనటుల పెర్ఫామెన్స్, బీజీఎం, సాంగ్స్ విషయంలో ఆడియెన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దాంతో సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చేశారు.

Tollywood Star hero in Teja Sajja Mirai Part 2 who is he

అయితే మిరాయ్ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే మంచు మనోజ్ మిరాయ్ చిత్రానికి ఒక దాని తర్వాత మరొక పార్ట్స్ వస్తూనే ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇక సినిమా చివరల్లో ఎండ్ టైటిల్స్ పడ్డాక బ్యాక్ నుంచి ఒక స్టార్ హీరోను చూపించారు. ఆయనతోనే మిరాయ్ పార్ట్ 2 ఉంటుందని అంటున్నారు. అయితే తేజా సజ్జాకు ఎంతో దగ్గరైన స్టార్ రానా దగ్గుబాటి. ఆయనే మిరాయ్ పార్ట్ 2లో నటించబోతున్నారని అంటున్నారు.

మిరాయ్ చిత్రం ప్రారంభంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ను అందించి, ఇక ఎండింగ్ లో మాత్రం రానా దగ్గుబాటిని చూపించారు. ఇలా బాహుబలి స్టార్స్ ను చూపించి వరల్డ్ వైడ్ గా సినిమా స్థాయిని పెంచుకున్నారు. ఇక మిరాయ్ పార్ట్ 2లో రానా దగ్గుబాటి నెగెటివ్ పాత్రలో నటించబోతున్నారని అంటున్నారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం మిరాయ్ చిత్రానికి మాత్రం ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది. ఇక ఈ చిత్రం 2 రోజుల్లో రూ.30 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ మిరాయ్ చిత్రంలో తేజా సజ్జా - రితికా నాయక్ జంటగా నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ విలన్ పాత్రలో మెప్పించారు. ఇక స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్, జగపతి బాబు కీలక పాత్రలను పోషించారు. టాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్శ ప్రసాద్ రూ.40 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. గౌర హరి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Read more about: teja sajja mirai rana daggubati
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X