twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముగ్గురు బడా హీరోలు రిజెక్ట్ చేసిన స్టోరి.. ప్రభాస్ ఎందుకు ఒప్పుకున్నాడంటే..?

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ మరో ఐదేళ్ల వరకు కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రభాస్ బాహుబలి అనంతరం కొన్ని చిన్న సినిమాలు కూడా చేయాలని అనుకున్నాడు. అయితే ఈ విషయంలో తెలియకుండానే భారీ స్థాయిలో ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సాహో తర్వాత 100 కోట్లకు మించిన బడ్జెట్ సినిమాలు చేయకూడదు అని అనుకున్నాడు. కానీ అతడికి మాత్రం భారీ స్థాయిలోనే ఆఫర్స్ వస్తున్నాయు. ఇక వచ్చిన ఆఫర్స్ ను ఎందుకు వదులుకోవడం అని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ప్రభాస్ మాత్రం తగ్గకుండా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం వరుసగా 5 ప్రాజెక్టు లను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం వరకు చాలా మంది హీరోలు కూడా ఒక సినిమా పూర్తి అయితే గాని మరో సినిమా గురించి ఆలోచించ లేదు. కానీ కరోనా లాక్ డౌన్ తర్వాత చాలామంది కొంత మార్పులు వచ్చాయి అనే చెప్పాలి.

    అయితే ఆ గ్యాప్ పూరించడానికి మరో మూడు నాలుగేళ్ల వరకూ కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసే విధంగా అయితే కథలను రెడీ చేసుకుంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఏకంగా ఐదు సినిమాలతో వరుసగా లైన్ లో పెట్టాడు. .ముందుగా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసినటువంటి సలార్ సినిమా రానుంది. హిందీ దర్శకుడు అయిన ఓం రావత్ తో ప్రభాస్ మొదటి సారి చేస్తున్న ఆదిపురుష్ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

    Tollywood top 3 heroes Prabhas 25th project spirit behind the reasons stars rejected

    ఇక మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు కె అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. ఇక ప్రభాస్ ఇటీవల 25వ సినిమా పై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే భారీ యాక్షన్ సినిమాను చేయడానికి ఒప్పుకున్నాడు. యు.వి.క్రియేషన్స్ టీ సీరీస్ కాంబినేషన్ లో రూపొందనున్న స్పిరిట్ సినిమాకు బడ్జెట్ కూడా గట్టిగానే ఖర్చు అవుతుందట. కేవలం ఇండియన్ భాషల్లోనే కాకుండా కొరియన్ చైనీస్ జపాన్ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.

    అంటే మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల అవుతున్న స్పిరిట్ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అని చిత్ర యూనిట్ దాదాపు 500 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధం అవుతోందట. అయితే ఈ సినిమా కథను దర్శకుడు సందీప్ ఇదివరకే ముగ్గురు స్టార్ హీరోల కూడా చెప్పాడట. అందులో మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురితో అయితే కొన్నిసార్లు చర్చలు జరిపాడు కానీ వాళ్ళు సినిమా చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక ప్రభాస్ అయితే స్క్రిప్టులను మళ్లీ మార్చడంతో వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ 25 ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

    English summary
    Tollywood top 3 heroes Prabhas 25th project spirit behind the reasons stars rejected
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X