Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రాజమౌళి మహేష్ సినిమాలో టామ్ క్రూజ్ అంటూ వార్తలు.. అసలు నిజం ఏమిటంటే..?
దర్శకధీరుడు రాజమౌళి తన తర్వాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరపైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఇదే ఏడది మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాస్త ఆలస్యం అయ్యేలాగా కనిపిస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన పూర్తి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా ఫినిష్ కాలేదు. అప్పుడే అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడు ఊహించిన విధంగా మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి ఒక హాలీవుడ్ స్టార్ హీరోను సంప్రదించినట్లు టాక్ వచ్చింది. ఇక అందులో ఎంతవరకు నిజముంది అనే వివరాల్లోకి వెళితే..

కథ దాదాపు ఫినిష్
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరితోను బిగ్గెస్ట్ మల్టీస్టారఏ సినిమాను తెరకెక్కించిన రాజమౌళి ఇప్పుడు అంతకుమించి అనేలా మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన కథ కూడా దాదాపు ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. కథ రచయిత విజయేంద్రప్రసాద్ కూడా ఆ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

ఊహించని స్థాయిలో ప్రశంసలు
అయితే మహేష్ బాబుతో ఇంకా పూర్తిస్థాయిలో కథ గురించి రాజమౌళి చర్చించలేదు. ఇటీవల రాజమౌళి గోల్డెన్ గ్లొబ్ అవార్డ్స్ కోసం అమెరికా వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ నాటు నాటు పాటకు కీరవాణి కూడా అవార్డ్ సొంతం చేసుకున్నారు. ఇక రాజమౌళి హాలీవుడ్ సినీ ప్రముఖుల చేత కూడా ప్రశంసలు అందుకోవడం విశేషం. చాలామంది ప్రపంచ సినీ ప్రముఖులు రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

హాలీవుడ్ సంస్థ
రాజమౌళి మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ తరహాలో తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా ఒక హాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా రాజమౌళి పనితీరుకు మెచ్చి మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు పార్ట్నర్ గా ఉంటామని కూడా అన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.

టామ్ క్రూజ్ పేరు వైరల్
అయితే రాజమౌళి ఆ సంస్థ తో మాట్లాడి ఒక హాలీవుడ్ హీరోను సినిమాలో ఒక పాత్ర కోసం అనుకుంటున్నట్లు వారితో మాట్లాడినట్లుగా కూడా గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్, మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర కోసం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అని కూడా కొందరు ప్రచారాలు చేస్తున్నారు.

అందులో నిజం లేదు
ఇక మరికొందరు అందులో ఎలాంటి నిజం లేదు అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక జక్కన్న అయితే ఇప్పటివరకు అసలు పూర్తిస్థాయిలో ఇంకా మహేష్ బాబు కోసం ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయలేదు. ప్రస్తుతం ఆయన RRR కి సంబంధించిన హడావిడిలోనే కనిపిస్తున్నారు. ఇక మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసమైతే పూర్తిస్థాయిలో కథ సిద్దమైన తర్వాతనే ఆ ప్రాజెక్టు షూటింగ్లో మొదలు పెట్టే అవకాశం ఉంది.

మహేష్ సినిమా ఎప్పుడు?
ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ ఫినిష్ కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అసలైతే రాజమౌళి మహేష్ బాబుతో ఈ ఏడాది సమ్మర్ లోనే సినిమా మొదలుపెట్టాలని అనుకున్నాడు. కానీ అనుకున్న సమయానికి కథ ఇంకా సిద్ధం కాలేదు. దానికి తోడు మహేష్ కూడా బిజీగా ఉన్నాడు. కాబట్టి వీరి కాంబినేషన్లో వచ్చే ప్రాజెక్ట్ వచ్చే ఏడాది స్టార్ట్ కావచ్చు అని తెలుస్తోంది.