twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంకో ప్రొడ్యూసర్ కొడుకు కూడా...హీరోగా ఎంట్రీ

    By Srikanya
    |

    హైదరాబాద్ : బెల్లంకొడ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు శ్రీను చిత్రంలో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇది మరో నిర్మాతకు ఉత్సాహాన్ని ఇచ్చినట్లైంది. ఆయన తన కుమారుడుని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారని సమాచారం. ఆయన మరెవరో కాదు డి.వివి దానయ్య. దేశముదురు, దుబాయి శ్రీను, కృష్ణ, జులాయి, కెమెరామెన్ గంగతో రాంబాబు, నాయక్ చిత్రాలు నిర్మించిన ఆయన తన కుమారుడుకి లాంచింగ్ గా ఓ రీమేక్ చిత్రం సైతం కొన్నారని తెలుస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు ఇష్క్ జాదే. బోనీకపూర్ కుమారుడు అర్జున్ కపూర్ ఈ చిత్రంతో ఎంట్రీ ఇవ్వటంతో ఇప్పుడు ఇదే చిత్రాన్ని తన కుమారుడు కి ఎంచుకున్నారని చెప్తున్నారు.

    ఇక ప్రముఖ దర్శకుడు వివి వినాయక్‌ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్‌ రూపొందిస్తున్న చిత్రం టైటిల్ 'అల్లుడు శ్రీను'. ఆ చిత్రంలో హీరో నిర్మాత కొడుకు శ్రీనివాస్. ఈ కుటుంబకథా చిత్రంలో సమంత హీరోయిన్‌ నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ బాణీలకు ధీటుగా హీరో శ్రీనివాస్‌ స్టెప్‌లు వేశాడని యూనిట్‌ చెబుతోంది. ఈ చిత్రం చాలా బాగా వస్తోందని, ట్రైలర్ విడుదల అయ్యాక..అంతా వినాయిక్ ప్రతిభ గురించే మాత్రమే కాక హీరో గురించి మాట్లాడుకుంటున్నారు.

    Top Producer Danayya Son to turn HERO

    బ్రహ్మానందం, శ్రీనివాస్ మధ్యలో వచ్చే అనేక సన్నివేశాల నేపథ్యంలో ఈ టైటిల్ అనేకసార్లు వినిపిస్తుండడంవల్ల ఈ చిత్రానికి ఇదే సరైన పేరని నిర్ణయించుకున్నామని తెలిపారు. సినిమా మొదటినుండి చాలా సరదా సరదాగా సాగుతూ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా విందు భోజనం అందిస్తుందని, ఈ చిత్రంలో తమన్నా చేసిన పాట హైలెట్‌గా ఉండనుందని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందని, ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులు ఆనందించేలా ఉంటుందని, కొత్త హీరో అయినా కానీ సినిమా అగ్ర స్థాయి హీరో చిత్రంలా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు.

    ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు, వెన్నెల కిశోర్, వేణు, ఫణి, ఫిష్ వెంకట్, పృధ్వి, జెన్ని, ప్రదీప్ రావత్, రవిబాబు, భరత్, ప్రవీణ్, ఆనంద్ భారతి, గుండు సుదర్శన్, అనంత్, అమిత్, నవీన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:కోన వెంకట్, రచన:గోపిమోహన్, కథ:కె.ఎస్.రవీంద్రనాధ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టన్ శివ, రవివర్మ, వెంకట్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కెమెరా:్ఛటా కె.నాయుడు, సమర్పణ:బెల్లకొండ సురేష్, నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.వి.వినాయక్.

    English summary
    After Beelamkonda Suresh's Son Sreenivas, producer Danayya's son is gearing up for an acting debut.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X