»   » 'బాహుబలి-2' షూట్ కు గిరిజనులు బ్రేక్

'బాహుబలి-2' షూట్ కు గిరిజనులు బ్రేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి-2 చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామోజీ ఫిలింసిటీలో కొంత తీశాక. బల్గేరియాలోనూ, కేరళలోనూ కొంత పార్ట్ తీయాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం అంతా సిద్దమైంది. అందులో భాగంగా.. కేరళలోని గిరిజన ప్రాంతంలోని ఓ అడవితో షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేశారు. ఇందుకోసం ఆ ప్రభుత్వం నుంచి కూడా ఫర్మిషన్ ఇచ్చింది. అయితే ఊహించని ట్విస్ట్ పడిందని సమాచారం.

అయితే అక్కడి గిరిజనులు ఈ చిత్ర షూటింగ్ అడ్డుకుంటామని ప్రకటించారని సమాచారం. అక్కడి గిరిజనలు...అసలు గవర్నమెంట్ ఆ లొకేషన్స్ లో షూటింగ్ కు ఫర్మిషన్ ఇవ్వటం ఇష్టం లేదంటున్నారు. సినిమా షూటింగ్ లకు అడవులు అనుమతి ఇవ్వటం ఫారెస్ట్ కన్వర్షేషన్ యాక్ట్ కు వ్యతిరేకమంటున్నారు. షూటింగ్ తో పర్యావరణం సమస్యలు తలెత్తుతాయని అందుకే తాము ఒప్పుకోబోమని చెప్తున్నారు. దాంతో ఇప్పుడు బాహుబలి టీమ్ ఆలోచనలో పడినట్లు సమాచారం.


ఈ విషయం ప్రక్కన పెడితే...తొలి చిత్రం కన్నా ఈ సీక్వెల్ ని మరింత పెద్ద హిట్ చేయాలని రాజమౌళి కష్టపడుతున్నారు. ఇంతకాలం హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు కేరళలకు మారింది. అక్కడ ఓ పురాతన కోటను లొకేషన్ గా ఆయన ఎంచుకున్నట్లు తెలుస్తోంది.


Tribals of Kerala against Baahubali-2 permissions!


కేరళలోని అతి పురాతనమైన కన్నూర్ ఫోర్ట్‌ లో ఆయన షూటింగ్ చేయనున్నారు. పదిహేనవ శతాబ్దంలో పోర్చుగీసు వారు నిర్మించిన కోట ఇది. ఈ కోటలో ఈ రోజు నుండి 10 రోజుల పాటు ‘బాహుబలి' సినిమా షూటింగ్ జరుగనుంది. ప్రభాస్‌తో పాటు సినిమాలోని కీ రోల్స్ లో కనిపించే నటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు.


ఈ షూటింగ్ లో కొన్ని యుద్ద సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంతకు ముందు బుల్ ఫైట్ సీన్‌కు సీక్వెల్‌గా కొన్ని సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించిన యూనిట్ మిగతా సన్నివేశాలను కేరళలో తెరకెక్కించనున్నారు.


ముఖ్యంగా బాహుబలి సీక్వెల్ పై పెరిగిపోయిన అంచనాల అందుకునేందుకు పార్ట్ 2 లో ఒక గంట పాటు వచ్చే వార్ ఎపిసోడ్ ని పూర్తిగా రీ డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తైన సెకండ్ పార్ట్ ని పూర్తి చేయడం కోసం ఇంకా 120 రోజులపైనే షూటింగ్ చేయాల్సి ఉంది.


'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.


'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా.

English summary
Tribals of Kerala in those parts where Baahubali-2 shooting will be taking place aren’t happy with the government for giving permissions for the makers of the film going against the Forest Conversation Act.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu