పవన్ కళ్యాణ్ ముందు ఎవరైనా బలాదూరే...
పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోతానని త్రిష చాలా సార్లు బహిరంగంగా చెప్పింది. అయినా కానీ పవర్ స్టార్ దయ ఆమెపై ఇంతకాలం దయ చూపలేదు. ఏదో 'బంగారం" సినిమాలో చిన్న సీన్ అయితే చేశాడు కానీ త్రిషకి ఒక్క సినిమాలోను ఛాన్సివ్వలేదు. 'అన్నవరం" లో అవకాశమిచ్చినట్టే ఇచ్చి చివరకు అసిన్ ని తీసుకున్నాడు. ఏదయితేనేమి త్రిష కల ఎట్టకేలకు 'లవ్ ఆజ్ కల్" రీమేక్ తో నెరవేరింది.
ఈ చిత్రంలో తన ఫేవరెట్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేస్తున్న త్రిష ఈ సినిమా కోసం హిందీలో 'ఏమాయ చేసావె" రీమేక్ చేసే ఛాన్స్ వదిలేసుకుంది. కట్టా మీఠా" సినిమా తో బాలీవుడ్ లో ప్లాప్ చవిచూసిన త్రిషకు 'ఏ మాయ చేసావె" సినిమా రీమేక్ మహాప్రసాదంలా లభించింది. బాలీవుడ్ భామలను కాదని గౌతమ్ మీనన్ తనకు అవకాశమిచ్చాడని అప్పట్లో ఆనందపడిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ ముందు ఎవరైనా బలాదూరేనని, ఇప్పుడు ఈ అవకాశాన్ని పొగొట్టుకుంటే మళ్లీ రాకపోవచ్చునని భావించి ఇందులో నటించడానికే సిద్దపడింది. డేట్స్ ప్రాబ్లెమ్ ఉందని చెప్పి గౌతమ్ ని వేరే వాళ్లను చూసుకోమంది.


Click it and Unblock the Notifications











