For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇతన్నే..త్రిష చేసుకోబోయేది(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్: అబ్బే...నాకా పెళ్లా అంటూ చాలాకాలంగా పెళ్లి వార్తలను ఖండిస్తూ వచ్చిన త్రిష ఎట్టకేలకు ఓ ఇంటిది అవబోతోంది...ఇతడే ఆమె జోడి అంటోంది తమిళ మీడియా. ఆమె తాజాగా అటువంటిదేమీ లేదు...అని ట్విట్టర్ లో ట్వీట్ చేసినా...కొద్ది రోజుల తర్వాత ఆమే అసలు విషయం బయిటపెడుతుంది. అసలు ఇతనితో ఆమెకు ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది. అందుకే రానా ఆమెకు దూరం అయ్యాడు అంటున్నారు.

  అంతేకాదు త్రిషకు నిశ్చితార్థం ముగిసిందనే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. పారిశ్రామికవేత్త, తమిళ నిర్మాత వరుణ్‌ మణియన్‌ను ఆమె పెళ్లి చేసుకోబోతుందని, ఆయనతో నిశ్చితార్థం కూడా ముగిసిందని కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. పదేళ్లపాటు దక్షిణాది సినిమాల్లో రాణించిన త్రిషకి కొంతకాలంగా సినిమాలు తగ్గడంతో ఆమె మనసు పెళ్లివైపు మళ్లిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నిశ్చితార్థం ముగిసినట్లు కథనాలు వెలువడడం గమనార్హం.

  ఇరు వైపుల నుంచి ఏ విధమైన అధికారిక కన్ఫర్మేషన్ లేనప్పటికీ ఈ వార్త పూర్తి హాట్ టాపి్ గా మారింది. దాంతో మీడియాలోనూ ఈ వార్త ప్రసారమవటం మొదలెట్టింది. దాంతో త్రిష ట్విట్టర్ లో ఈ విషయం గురించి ప్రస్దావిస్తూ ట్వీట్ చేసింది.

  త్రిష ట్వీట్ లో...'' నాకు ఎంగేజ్ మెంట్ లాంటిదేమి జరగలేదు... అలాంటిదేమన్నా జరిగితే..నా నుంచే మొదట మీరు వింటారు.. '' అంది. ఇక ఈ మధ్య కాలంలో త్రిష విషయమై రకరకాల రూమర్స్ ప్రచారంలోకి రావటం మొదలయ్యాయి. వాటిని సాధ్యమైనంత వరకూ త్రిష ఖండిస్తూ వస్తూనే ఉంది.

  ముందు సినిమా తరువాతే పెళ్లి అంటున్నారు చిరునవ్వుల చిన్నది నటి త్రిష. ఈమెలో ప్రత్యేకత ఏమిటంటే సినిమాకు పరిచయం అయినప్పడు నవనవలాడుతూ ఎంత అందంగా ఉన్నారో నేటికీ మాయని అందాన్ని మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. నటిగా దశాబ్ద కాలం దాటినా నేటికీ హీరోయిన్‌గా తన స్థానాన్ని పదిల పరచుకుంటున్నారు. త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబుకు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారు.

  Trisha Engaged To Tamil Producer

  ఈ ముద్దుగుమ్మ ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే తెలుగు చిత్రంలో నటించారు. అదే విధంగా శింబు సరసన ఇప్పటికే విన్నై తాండి వరువాయో చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజమే.

  పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్ నిర్మించనున్న ఈ చిత్రం గురించి త్రిష మాట్లాడుతూ తన అభిమాన దర్శకుల్లో సెల్వరాఘవన్ ఒకరన్నారు. అలాంటి దర్శకుడితో మరోసారి కలసి పని చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సెల్వరాఘవన్ నెల క్రితం ఈ చిత్ర కథ చెప్పారన్నారు. కథ చాలా నాలెడ్జీగా ఉందనిపించిందని అన్నారు. దశాబ్దం దాటినా హీరోయిన్‌గా వరుస అవకాశాలు వరిస్తున్నాయి. మరి పెళ్లి సంగతేమిటన్న ప్రశ్నకు తనకు సినిమానే ఫస్ట్ అని మ్యారేజ్ తరువాత అని త్రిష పేర్కొనడం విశేషం.

  త్రిష ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే...

  త్రిష కు చెప్పుకోతగ్గ పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. అయినా ఆమె తన రెమ్యునేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం రాజీ పడలేదని సమాచారం. బాలకృష్ణ తో చేస్తున్న గాడ్సే చిత్రం కోసం ఆమెకు ఇచ్చిన ఎమౌంట్ గురించే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు కోటి పాతిక లక్షలు వరకూ పే చేసారని తెలుస్తోంది. మొదట నిర్మాతలు అంత పే చేయటానికి ముందుకు రాలేదని అయితే బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి వారిని ఒప్పించి, ఆమెను తన సినిమాలోకి తీసుకున్నారని వినిపిస్తోంది.

  త్రిష తమిళంలో ఓ చిత్రం చేస్తోంది. అందులో త్రిష తన అభిమానులకు ఆనందం కలిగించేలా స్పెషల్ లేదా ఐటం సాంగ్ చేస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు..అజిత్ తో గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న చిత్రం. ఈ చిత్రం అనుష్క హీరోయిన్ కావటం విశేషం. ఈ విషయాన్ని తన మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్ తెలియచేసారు.

  'తల' అజిత్‌ 55వ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఆ సినిమాకు పేరుపెట్టకపోయినా.. 'తల - 55' పేరుతో ఇప్పటికే పోస్టర్లు, బ్యానర్లు నగరంలో భారీగా దర్శనమిస్తున్నాయి. గౌతంమీనన్‌ దర్శకత్వంలోని ఈ సినిమాలో అనుష్క కథానాయిక. త్రిష ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇందులో ఆమె ఓ ప్రత్యేక గీతంలో చిందులేసినట్లు సమాచారం.

  గౌతంమీనన్‌ దర్శకత్వంలో 'కాక్క కాక్క' వంటి పలు సినిమాలలో అవకాశాలు వచ్చినా.. కొన్ని కారణాల వల్ల అజిత్‌ నటించలేదు. చాలా కాలం తర్వాత వారి కాంబినేషన్లో యాక్షన్‌ కథాంశంతో దీన్ని తెరకెక్కించారు. అజిత్‌ పోలీసు పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ డాన్‌ మెక్కాతర్‌ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. హ్యారీస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చారు.

  షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. క్లెమాక్స్‌ సన్నివేశాలను హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. రెండు పాటలు, కొన్ని ప్యాచ్‌ సన్నివేశాలే ఉన్నాయి. ఈ నెలాఖరులో సినిమా పేరు ప్రకటించి.. ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. క్రిస్మస్‌ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Varun Manian, owner of film production company Radiance Media Group and a real-estate tycoon got engaged to heroine Trisha Krishnan in a low key ceremony.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X