»   » మాస్ మహరాజాకి ముద్దుస్తానంటోన్న త్రిష...!

మాస్ మహరాజాకి ముద్దుస్తానంటోన్న త్రిష...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల తార త్రిషను ఇప్పుడు వరుసగా రీమేక్ చిత్రాలే వరిస్తున్నాయి. అందాల తార త్రిషను ఇప్పుడు వరుసగా రీమేక్ చిత్రాలే వరిస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ రీమేక్‌గా తెలుగులో రూపొందిన 'తీన్‌మార్"లో నటించిన ఈ చెన్నయ్ చందమామ త్వరలో మరో రెండు రీమేక్ చిత్రాల్లో నటించనున్నారని సమాచారమ్. బాలీవుడ్‌లో విడుదలై విజయాన్ని అందుకున్న 'తను వెడ్స్ మను" చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో పునర్ నిర్మిస్తున్నారు. ఆ చిత్రంలో కథానాయకుడిగా నటించిన మాధవనే ఈ చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నారు. ఇందులో త్రిష మాధవన్‌తో ఆడిపాడనున్నారు. త్వరలో ఓ సంస్థ తెలుగులో నిర్మించనున్న మరో చిత్రంలో రవితేజతో త్రిష రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారని తెలిసింది. బాలీవుడ్‌లో విడుదలైన 'బ్యాండ్ బాజా బారాత్" చిత్రానికి ఇది రీమేక్. 'బమ్ చిక్ బమ్" పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది.

సో.. వరుసగా మూడు రీమేక్ చిత్రాల్లో నటిస్తూ ఆమె రీమేక్‌ల పరంగా హేట్రిక్ పూర్తిచేయనున్నారు. ఇంతకు ముందు రవితేజ, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన 'కృష్ణ" చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 'బమ్ చికు బమ్" కూడా 'కృష్ణ" తరహాలోనే పూర్తి వినోదాత్మకంగా వుంటుందట. అంతేకాదు... మాతృక 'బ్యాండ్ బాజా బారాత్"లో హీరో, హీరోయిన్ మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు వున్నాయట. ఈ చిత్రంలో రవితేజ, త్రిషల మధ్య ఆ సన్నివేశాలు వుంటాయా, లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇటీవల 'తీన్‌మార్"లో పవన్‌తో లిప్‌లాక్ చేసిన త్రిష ఈ చిత్రంలో కూడా లిప్‌లాక్ చేస్తారనే గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి.

English summary
It is reported earlier that Bollywood Super hit film 'Band Baaja Bharath' is being remade in Telugu as 'Bum Chik Bum' with Ravi Teja and Trisha in lead roles. Now the latest news is that Trisha is going to lip-lock Ravi Teja this time in remake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu