»   » త్రిష పెళ్లి రద్దవ్వడానికి బాలయ్యకు సంబంధం ఏమిటి?

త్రిష పెళ్లి రద్దవ్వడానికి బాలయ్యకు సంబంధం ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సినీసెలబ్రిటీలపై వస్తున్న రూమర్లకు ఓ అర్థం పర్థం లేకుండా పోతోంది. తాజాగా త్రిష ఎంగేజ్మెంట్ రద్దవడానికి....బాలయ్యకు లింకు పెడుతూ వార్తలు ఫిల్మ్ నగర్లో ప్రచారంలోకి వచ్చాయి. బాలయ్యతో నటించే సమయంలో హీరోయిన్ల పెళ్లి సెటిలయితే రద్దువుతుందనే అర్థపర్థం లేని సెంటిమెంటును ప్రచారంలోకి తెచ్చారు కొందరు. అయితే ఇది బాలయ్య యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న ప్రచారమే అనేది నందమూరి అభిమానుల వాదన.

గతంలో నయనతార-ప్రభుదేవా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో నయనతార బాలయ్య సరసన ‘శ్రీరామరాజ్యం' చిత్రంలో నటిస్తోంది. కారణాలు తెలియదు కానీ అనుకోకుండా ఆ ఇద్దరికి బ్రేకప్ అయింది. ఇపుడు త్రిష బాలయ్య సరసన ‘లయన్' చిత్రంలో నటిస్తోంది. త్రిష-వరుణ్ మణియన్ మధ్య బ్రేకప్ అయింది. దీంతో గాసిప్ రాయుళ్లు రెచ్చిపోయారు. బాలయ్యతో నటించడం వల్లనే ఆమె పెళ్లి రద్దయిందనే వాదన తెరపైకి తెచ్చాయి. అయినా బాలయ్యకు...త్రిష పెళ్లి రద్దుకు సంబంధం పెట్టి మాట్లాడటం అర్థం పర్థం లేని చర్యకాకుంటే మరేమిటి?

Trisha Krishnan confirms break-up with Varun Manian

త్రిష-వరుణ్ మణియన్ బ్రేకప్
తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం ...ఈ ఏడాది జనవరిలో కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పెళ్లి తేదీ ప్రకటించలేదు. నిశ్చితార్థం తర్వాత వరుణ్, త్రిష విహారయాత్రకు కూడా వెళ్లారు. అయితే, ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాళ్లు విడిపోయారనే వార్త కొద్దిరోజులుగా హల్‌చల్ చేస్తోంది.

బయట వస్తున్న ఊహాగానాలు విచిత్రంగా ఉన్నాయి. దయచేసి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టండి. నేనిప్పుడు సింగిల్‌గా, హ్యాపీగా ఉన్నాను' అని త్రిష స్వయంగా ట్వీట్ చేశారు. ఆ విధంగా త్రిష తన బ్రేక్ అప్ విషయాన్ని తేల్చి చెప్పేసింది. మరో ప్రక్క ఆమె తల్లి సైతం ...వివాహం ఆగిపోయిందనే విషయం ఖరారు చేస్తూ గురువారం తమిళ మీడియాకు తెలియచేసారు. అయితే విడిపోవడానికి కారణాలు మాత్రం తెలియలేదు.

English summary
South India actress Trisha Krishnan confirms break-up with Varun Manian.
Please Wait while comments are loading...