For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాబోయే భర్త సాయం?: త్రిష ఆగిన సినిమా మళ్లీ మొదలు

  By Srikanya
  |

  హైదరాబాద్: చాలా కాలం క్రితం మొదలై ఆర్దిక సమస్యలతో ఆగిపోయిన త్రిష సినిమా మళ్లీ మొదలవుతోంది. ఆమె కాబోయే భర్త ఫైనాన్స్ చేస్తూ ఈ ప్రాజెక్టు మొదలవుతోందని అంతటా వినపడుతోంది. త్రిష కాబోయే భర్త వరుణ్‌ మణియన్‌ ఓ పేరొందిన నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఇంతకీ ఆ సినిమా పేరు ఏమిటీ అంటారా...భోగి.

  తెలుగు, తమిళ భాషలలో ప్రముఖ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘భోగి' తిరిగి ప్రారంభమయ్యింది. మరో ఇద్దరు హీరోయిన్లు పూనం బజ్వా, ఒవియా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సురేఖా వాణి కీలక పాత్రలో నటిస్తుంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  రేసీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ వార్తను త్రిష స్వయంగా సోషల్ మీడియాలో తెలిపింది. దశాబ్దన్నర కాలంగా హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ చెన్నై సుందరి, కెరీర్లో నటిస్తున్న ఫస్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది.

   Trisha’s next titled as Bhogi

  ‘‘ఈ మధ్యే భోగి సంబరాలు జరుపుకున్నాం. మళ్లీ నేను భోగి పండగ మూడ్‌లో ఉండబోతున్నా'' అంటున్నారు త్రిష. అలా అనడానికి కారణం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో త్రిష, పూనమ్ బజ్వా, ఓవియా కథానాయికలుగా ‘భోగి' అనే చిత్రం రూపొందుతోంది. ముగ్గురు స్నేహితులు, ఒక ప్రయాణం నేపథ్యంలో సాగే మంచి థ్రిల్లర్ మూవీ ఇదని త్రిష పేర్కొన్నారు.

  ముగ్గురు స్నేహితురాళ్ళు ఒక ప్రయాణంలో ఎదుర్కున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాండ్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది. వరుస పరాజయాలతో త్రిషకు మార్కెట్ లేకపోవడం, ఆర్ధిక సమస్యల కారణంగా సినిమాను పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. సినిమా తిరిగి ప్రారంభం కావడంతో త్రిష చాలా సంతోషంగా ఉంది.

  చెన్నై చిన్నది త్రిష, నిర్మాత వరుణ్‌ మణియన్‌ల నిశ్చితార్థం శుక్రవారం చెన్నైలో జరిగింది. 1999లో 'మిస్‌ చెన్నై'గా ఎంపికైన త్రిష 2002లో తమిళ తెరకు పరిచయమైంది. 'వర్షం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని దాదాపు 12 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించింది.

  ప్రస్తుతం బాలకృష్ణ సరసన 'లయన్‌' చిత్రంలో ఆడిపాడుతోంది. 'వాయై మూడి పేసవుం' చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమైన వరుణ్‌మణియన్‌తో ఆమె ప్రేమలో పడ్డారు. శుక్రవారం ఉదయం వీరి నిశ్చితార్థం చెన్నై, ఆళ్వార్‌పేటలోని వరుణ్‌ మణియన్‌ ఇంట్లో జరిగింది. కార్యక్రమానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

  త్రిషను ముంబయికి చెందిన ఓ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ముస్తాబు చేశారు. అనంతరం త్రిష, వరుణ్‌ ఉంగరాలు మార్చుకున్నారు. చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరు నటీ నటులకు శనివారం విందు ఇచ్చింది.

  అనుకున్నట్లుగా జనవరి 23న చెన్నైలో కుటుంబ సభ్యుల మధ్య త్రిష, వరుణ్‌ల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. చెన్నైలోని ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు కుటుంబ సభ్యులు మరియు వారి స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఎంగేజ్ మెంట్ పార్టీలో ఛార్మీ, మాధవన్, ధనుష్, శింబు, ఆర్య, సంగీత దర్శకుడు అనిరుధ్, దేవిశ్రీ ప్రసాద్ వంటి వారు పాల్గొన్నారు.

  శనివారం... ఈ ఎంగేజ్ మెంట్ పార్టీని ఘనంగా ఇచ్చింది. ఈ పార్టీకి త్రిష ఫ్రెండ్స్ మాత్రమే కాక సినీ పరిశ్రమ నుంచి ఛార్మీ, దేవిశ్రీ ప్రసాద్ వంటి సెలబ్రెటీలు హాజరయ్యారు. త్రిష ఆ పార్టీలో చాలా ఆనందంగా కనిపించింది.

  English summary
  Actress Trisha tweeted "Happy 2 announce that I will be rejoining d cast n crew for my film now titled "BHOGI" with Poonam n Oviya A racy thriller about "3 friends-1 journey-no limits" Gal power all d way Shooting begins shortly...Thx fr all ur wishes."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X