»   » ఒకళ్లని చూసి ఫాలో అవడం అన్నది మన లైఫ్ లో లేనేలేదు: త్రిష

ఒకళ్లని చూసి ఫాలో అవడం అన్నది మన లైఫ్ లో లేనేలేదు: త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకళ్లని చూసి మరొకళ్లు తెలుగు గలగలా మాట్లాడేయాలని ఇప్పుడు మన హీరోయిన్లంతా తెగ ఆరాటపడిపోతున్నారు. నిన్న కాక మొన్నొచ్చిన తాప్సీ అప్పుడే 'మిస్టర్ పెర్ ఫెక్ట్' సినిమాలో డబ్బింగ్ చెప్పేయడంతో ఎప్పటి నుంచో వున్న సీనియర్ హీరోయిన్లలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఇప్పుడు త్రిష కూడా ప్రస్తుతం అదే పనిలో వుంది. 'మరో ఆరునెలల్లో తెలుగులో ఫ్లూయేంట్ గా మాట్లాడేస్తా. త్వరలో నా పాత్రకి నేనే డబ్బింగ్ కూడా చెప్పేస్తా చూడండి' అంటూ త్రిష చాలెంజ్ కూడా చేస్తోంది.

మెన్న తాప్సీ, నిన్న తమన్నా, 100%లవ్ సినిమాలో తమన్నా కూడా డబ్బిగ్ చెప్పింది. చాలా భాగవచిందిని టాక్, తమన్నా, తాప్సీలను చూసే మీరూ తెలుగు నేర్చుకుంటున్నారా? అంటే మాత్రం ఈవిడకి ఎక్కడా లేని కోపం వచ్చేస్తోంది. 'ఒకళ్లని చూసి ఫాలో అవడం అన్నది మన లైఫ్ లో లేనేలేదు. నా అభిమానులని సంతోషపెట్టాలని అనుకున్నాను. అందుకే నేర్చుకుంటున్నాను" అంటూ డొంకతిరుగుడు సమాధానం చెబుతోంది. 'తీరా ఈవిడ తెలుగు పూర్తిగా నేర్చుకునే సరికి సినేమాలుండాలి కదా?' అంటూ ఈమె ప్రత్యర్థులు మరోపక్క జోక్ చేస్తున్నారు!

English summary
Yes People, time to throw the surprise. Tamanna dubbed in Telugu in her own voice. This film has Naga Chaitanya in the lead role. Recently Tapsi dubbed for Jhummandi Naadam. Now Trisha is showing more interested to dub her own voice in her movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu