»   » అప్పట్లో అది రూమరే: త్రివిక్రమ్‌ చెప్పాక నిజమే అనిపిస్తోంది!

అప్పట్లో అది రూమరే: త్రివిక్రమ్‌ చెప్పాక నిజమే అనిపిస్తోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అ..ఆ'. నిన్ననే ఆడియో రిలీజ్ వేడుక జరుపుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆడియో వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడిన మాటలను బట్టి పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి.

'అ...ఆ' చిత్రం హీరోయిన్ రోల్ ప్రధానంగా నడిచే సినిమా అని గతంలో రూమర్స్ వినిపించాయి. త్రివిక్రమ్ గత సినిమా 'సన్నాఫ్ సత్యమూర్తి'. వాస్తవానికి ఈ సినిమా కంటే ముందే 'అ..ఆ' స్టోరీ రెడీ అయింది. అంటే 'అత్తారింటికి దారేది' సినిమా తర్వాతే త్రివిక్రమ్ ఈ సినిమా చేయాలనుకున్నారు. హీరోయిన్ గా సమంతను కూడా ఫిక్స్ చేసాడు. అయితే అప్పట్లో ఈ సినిమాకు హీరో దొరకక ఆగిపోయిందనే రూమర్స్ వినిపించాయి. అందుకు కారణం సినిమాలో హీరో కంటే హీరోయిన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉండటమే అనే రూమర్స్ వినిపించాయి.

Trivikram about A Aa movie story

ఎట్టకేలకు ఈ సినిమాలో హీరోగా నటించడానికి నితిన్ ఒప్పుకున్నాడు. గతంలో వినిపించిన రూమర్స్ గురించి కూడా అంతా మరిచి పోయారు. అయితే తాజాగా ఆడియో వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడిన మాటలను బట్టి కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి.

''ఈ సినిమాకోసం 30 రోజులు 40 రోజులు అనే లెక్క చూసుకోకుండా.. సమంత గారు ఎన్నిపడితే అన్ని ఎప్పుడు పడితే అప్పుడు కాల్ షీట్లు ఇచ్చారు. ధన్యోస్మి. ఈ సినిమాలో సమంత క్యారెక్టర్ పెద్దదా.. నితిన్ క్యారెక్టర్ పెద్దదా.. అనే కన్నా.. ఈ సినిమాలో కథే ఒక హీరో.. అందరికంటే కథ పెద్దది'' అని కూడా త్రివిక్రమ్ తెలిపారు. ఆయన మాటలు విన్న వారు.... గతంలో వినిపించిన రూమర్స్ నిజమేనేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

English summary
A Aa is directed by king of classics Trivikram and produced by S.Radha Krishna. Trivikram is heart and soul of the movie. Produced by S. Radha Krishna under his banner Haarika & Haasine Creations, it features Nithin, Samantha Ruth Prabhu and Anupama Parameswaran in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu